Pensioners Alert: పెన్షనర్లకు గుడ్ న్యూస్‌..! లైఫ్ సర్టిఫికేట్‌పై ఇప్పుడు ఎటువంటి చింత అవసరం లేదు..

Pensioners: పెన్షన్ తీసుకునే వ్యక్తులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పించడం పెద్దపని. నవంబర్ 1 నుంచి 30 మధ్య లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పిస్తారు. ఈ సర్టిఫికెట్

Pensioners Alert: పెన్షనర్లకు గుడ్ న్యూస్‌..! లైఫ్ సర్టిఫికేట్‌పై ఇప్పుడు ఎటువంటి చింత అవసరం లేదు..
Pensioner
Follow us
uppula Raju

|

Updated on: Oct 11, 2021 | 10:51 AM

Pensioners Alert:పెన్షన్ తీసుకునే వ్యక్తులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పించడం పెద్దపని. నవంబర్ 1 నుంచి 30 మధ్య లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పిస్తారు. ఈ సర్టిఫికెట్ సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోతుంది. ఏదేమైనా 80 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు అక్టోబర్ 1 తర్వాత ఎప్పుడైనా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ సమర్పించడానికి రెండు నెలల సమయం ఉంది. అయితే మునుపటితో పోలిస్తే ప్రభుత్వం అనేక విధాలుగా లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పించే సదుపాయాన్ని కల్పించింది. ఇప్పుడు పెన్షనర్ దీని కోసం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5 మార్గాల్లో సులువుగా సమర్పించవచ్చు.

1. ఆన్‌లైన్‌లో సమర్పించండి పెన్షనర్లు జీవన్ ప్రామాన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. దీని కోసం jeevanpramaan.gov.in కి వెళ్లాలి. పెన్షనర్ పోర్టల్ నుంచి జీవన్ ప్రామాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత ఆధార్‌లో ఇచ్చిన వేలిముద్ర ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌ అవుతుంది. మొదటగా మొబైల్‌లో జీవన్ ప్రమాన్ యాప్ డౌన్‌లోడ్ చేసి OTG కేబుల్‌తో కనెక్ట్ చేయాలి. తర్వాత పెన్షనర్ వేలిముద్ర ఇవ్వాల్సిన పరికరాన్ని కొనుగోలు చేయాలి. అనంతరం పెన్షనర్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి ద్వారా సర్టిఫికెట్ సబ్‌మిట్‌ అవుతుంది.

2 బ్యాంకుకు వెళ్లి సర్టిఫికెట్ సమర్పించవచ్చు పెన్షన్ వచ్చే బ్యాంకు శాఖకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం సులభమైన మార్గం. లైఫ్ సర్టిఫికేట్ ఫారం బ్యాంక్ కౌంటర్‌లో లభిస్తుంది దాన్ని నింపి అందిస్తే సరిపోతుంది.

3. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ప్రస్తుతం బ్యాంకులు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీని కింద బ్యాంక్ సంబంధిత పనిని కొంత రుసుము చెల్లించి ఇంట్లో చేయవచ్చు. మీకు ఖాతా ఉన్న బ్యాంక్ ఉద్యోగి పెన్షనర్ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ఫాంని అందిస్తారు. డోర్ స్టెప్ బ్యాంకింగ్‌లో ప్రస్తుతం 12 బ్యాంకులు ఇంటి వద్ద కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి. దీని కోసం బ్యాంక్ నుంచి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్ లేదా DSB ఇంటికి వస్తారు. లైఫ్ సర్టిఫికెట్ ఫాంని నింపిన తర్వాత బ్యాంకులో అందిస్తారు.

4. పోస్ట్‌మాన్ ద్వారా పోస్ట్‌మెన్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికెట్‌లను సబ్‌మిట్‌ చేయవచ్చు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిసి ఇంట్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సదుపాయాన్ని ప్రారంభించింది. దీని కోసం పెన్షనర్ తన మొబైల్ ఫోన్‌లో పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాని నుంచి డోర్ స్టెప్ సౌకర్యాన్ని అభ్యర్థించాలి.

5. అధికారం సంతకం ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌పై ‘నియమించబడిన అధికారి’ సంతకం చేసినట్లయితే పెన్షనర్ దానిని జమ చేయడానికి వ్యక్తిగతంగా బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. ఆ కాపీని పెన్షనర్‌కు బదులుగా బ్యాంకులోని ఎవరైనా డిపాజిట్ చేయవచ్చు. అయితే CPAO బుక్‌లెట్‌లో.. లైఫ్ సర్టిఫికెట్‌పై ఎవరు సంతకం చేయవచ్చో ఆ అధికారుల గురించి ప్రస్తావించారు.

ఒక్క రోజులో 95 పరుగులు..12 వికెట్లు.. టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన మ్యాచ్‌..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో