AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాతాదారులకు గమనిక..! ఆర్బీఐ రెపో రేటును మార్చలేదు.. ఎక్కవ వడ్డీ కావాలంటే ఇలా చేయండి..

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ శుక్రవారం పాలసీ రేట్లను మార్చలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ రేటును తగ్గించింది.

ఖాతాదారులకు గమనిక..! ఆర్బీఐ రెపో రేటును మార్చలేదు.. ఎక్కవ వడ్డీ కావాలంటే ఇలా చేయండి..
Rupee
uppula Raju
|

Updated on: Oct 11, 2021 | 8:57 AM

Share

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ పాలసీ రేట్లను మార్చలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ రేటును తగ్గించింది. ఆర్‌బిఐ కీలక రేట్లపై యథాతథ స్థితి కొనసాగుతుంది. దీనివల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ దారులు వడ్డీ రేట్లు పెరిగే వరకు వేచి ఉండాలి. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకులు, NBFCలు రేట్లు తగ్గిస్తున్నందున FD వడ్డీ రేట్లు గత కొంత కాలంగా కనిష్ట స్థాయిలో ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ FD రేట్లు తగ్గడం వల్ల పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై తక్కువ రాబడిని పొందుతున్నారు. మరింత లాభం పొందడానికి పెట్టుబడిదారులు ఇతర పెట్టుబడి ఎంపికలను ఎంచుకోవచ్చు. అధిక రాబడి పొందాలంటే ఇలా చేయవచ్చు.

ఫ్లోటింగ్ రేటు FD, బాండ్లు ఈ రోజుల్లో చాలా బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ FDని అందిస్తున్నాయి. భవిష్యత్‌లో వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల గురించి మీకు తెలియకపోతే, మీ డబ్బులను తక్కువ వడ్డీ రేట్లలో డిపాజిట్‌ చేయడం ఇష్టం లేకపోతే ఫ్లోటింగ్ రేట్ FD లు లేదా బాండ్లు ఎంచుకోవచ్చు.  ఎందుకంటే ఫ్యూచర్లలో RBI రెపో రేటును పెంచితే మీ FD లో వడ్డీ రేటు కూడా పెరుగుతుంది.

ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్ పెట్టుబడిదారులు తమ డబ్బును ఆర్‌బిఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లలో డిపాజిట్‌ చేయవచ్చు. ఇది 7 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది. ప్రస్తుతం 7.15 శాతం రిటర్న్ ఇస్తోంది ఇది FD లపై బ్యాంకులు అందించే రేట్ల కంటే చాలా ఎక్కువ. ఈ బాండ్‌లో వడ్డీ రేటుని సగం సంవత్సరానికే చెల్లిస్తారు. కాబట్టి సీనియర్ సిటిజన్స్‌కి ఇది మంచి ఎంపిక. రిస్క్, వడ్డీ రేట్ల మధ్య సరైన సమతుల్యతను సాధించడానికి వేర్వేరు బ్యాంకులలో డిపాజిట్లు చేయడం FD పెట్టుబడికి అనువైన వ్యూహం. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల FD లపై రాబడులు 3-7 శాతం ఉండగా, అనేక సహకార, చిన్న బ్యాంకులు 1-2 శాతం అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మీకు అధిక రాబడులు కావాలంటే చిన్న బ్యాంకులను ఎంచుకోవచ్చు.ఏదేమైనా బ్యాంక్ స్థిరత్వం గురించి తెలుసుకోండి మీ నష్టాలను తగ్గించుకోండి.

Samantha after Divorce: విడాకుల తర్వాత సమంత ఎక్కడుంటోంది..? మరిన్ని వివరాలు ఈ వీడియోలో…

Mystery Rivers: భూమి కింద ప్రవహించే ఈ ఐదు నదుల గురించి మీకు తెలుసా..? ఆసక్తికర విషయాలు..!

Crime News: ఉద్యోగం ఇప్పిస్తామంటూ వ్యభిచార రొంపిలోకి.. పాతబస్తీ బాలికలపై ముఠా కన్ను..