AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Sons : 5 జీ ప్రపంచంలోకి టాటాగ్రూప్..! ఇక ఎయిర్‌టెల్, జియోలకు గట్టి పోటీ..

Tata Sons : టాటా గ్రూప్ 5 జి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు రిలయన్స్ జియో 5G కి సంబంధించి తన మెగా ప్లాన్‌ను

Tata Sons : 5 జీ ప్రపంచంలోకి టాటాగ్రూప్..! ఇక ఎయిర్‌టెల్, జియోలకు గట్టి పోటీ..
Ratan Tata
uppula Raju
|

Updated on: Jul 31, 2021 | 9:46 PM

Share

Tata Sons : టాటా గ్రూప్ 5 జి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు రిలయన్స్ జియో 5G కి సంబంధించి తన మెగా ప్లాన్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు టాటా గ్రూప్ కూడా ఈ రేసులో చేరింది. టెలికాం పరికరాల తయారీ సంస్థ తేజస్ నెట్‌వర్క్‌లో వాటాను కొనుగోలు చేస్తామని టాటా సన్స్ ప్రకటించింది. ఈ డీల్ కారణంగా టాటా గ్రూప్ ఎంట్రీ 5G లో ఉంటుందని తెలుస్తోంది. నోకియా, ఎరిక్సన్, హువాయ్ వంటి కంపెనీలతో పోటీ పడగలదు.

రిలయన్స్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ జియో సహాయంతో భారతదేశాన్ని 2 జి రహితంగా, 5 జి ఎనేబుల్ చేస్తానని చెప్పారు. దేశంలో రిలయన్స్ జియో మాత్రమే 5 జిని ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు. రిలయన్స్ జియో అత్యాధునికమైన 5G టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ కోసం ఇది ఒక పెద్ద ముందడుగు. 5G ట్రయల్స్ సమయంలో జియో విజయవంతంగా 1 Gbps కంటే ఎక్కువ వేగాన్ని సాధించిందని ముఖేష్ అంబానీ ప్రకటించారు.

ముఖేష్ అంబానీ జియో ‘మేడ్ ఇన్ ఇండియా’ పరిష్కారాన్ని ప్రపంచ స్థాయిగా అభివర్ణించారు. ఢిల్లీ, ముంబై సహా అనేక నగరాల్లో 5G టెక్నాలజీని జియో పరీక్షిస్తోంది. జియో 5 జి భారతదేశంలో విజయవంతం అయినప్పుడు అది ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని చెప్పారు. ఈ విధంగా భారతదేశం 5G అభివృద్ధి, ఎగుమతులకు ప్రపంచ కేంద్రంగా మారుతుందన్నారు.

టాటా సన్స్, తేజస్ నెట్‌వర్క్ ఒప్పందానికి సంబంధించి ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. టాటా సన్స్ యూనిట్ అయిన పనాటోన్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్, తేజస్ నెట్‌వర్క్‌లో 43.35 శాతం వాటాను ప్రిఫరెన్షియల్ ఇష్యూ సహాయంతో కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించి టాటా సన్స్ (టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ) అనుబంధ సంస్థ పాంటోన్ ఫిన్‌వెస్ట్‌తో బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తేజస్ నెట్‌వర్క్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ పాంటోన్‌కు 1.94 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఒక్కో షేరుకు రూ. 258 చొప్పున జారీ చేస్తుంది మొత్తం రూ.500 కోట్లు.

GarudaPurana : గరుడపురాణం ప్రకారం.. ఈ 4 అలవాట్ల వల్ల మీ అదృష్టం, జ్ఞానం కనుమరుగవుతాయి..!

Bulls Fight Video: అమలాపురం దేవి సెంటర్‌లో కుమ్మేసుకున్న ఆంబోతులు.. కొమ్మువిరిగినా వీడనిపట్టు వీడియో.

CM KCR: ఆ పెద్దాయన అంటే ఆయనకు ఎప్పుడు గౌరవమే.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.. ఇప్పుడు ఆయనే నారాజ్‌.. ఎవరాయన?