AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Play-Airtel DTH: టాటా ప్లే-ఎయిర్‌టెల్ డిటిహెచ్ విలీనం కానున్నాయా? కొత్త కంపెనీలో ఎయిర్‌టెల్‌కు వాటా ఎంత?

Tata Play-Airtel DTH: డీటీహెచ్ చందాదారుల సంఖ్య నిరంతరం తగ్గుతోంది. కంపెనీ కస్టమర్ల సంఖ్య 12 కోట్ల నుండి 84 మిలియన్లకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఎయిర్‌టెల్ స్పందించలేదు. అంతకుముందు టాటా తన టెలికాం..

Tata Play-Airtel DTH: టాటా ప్లే-ఎయిర్‌టెల్ డిటిహెచ్ విలీనం కానున్నాయా? కొత్త కంపెనీలో ఎయిర్‌టెల్‌కు వాటా ఎంత?
Subhash Goud
|

Updated on: Feb 25, 2025 | 4:41 PM

Share

టాటా ప్లే, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. నివేదికల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. విలీనం షేర్ స్వాప్ ద్వారా జరిగే అవకాశం ఉంది. డైరెక్ట్-టు-హోమ్ రంగంలో లైవ్ స్ట్రీమింగ్ పెరుగుతున్న ఆధిపత్యం, తగ్గుతున్న చందాదారుల సంఖ్య మధ్య విలీన చర్చలు వచ్చాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో ఎయిర్‌టెల్‌కు 50 శాతానికి పైగా వాటా ఉంటుందని వర్గాలు తెలిపాయి. ఈ విలీనం ఒకసారి ఖరారైతే, ఎయిర్‌టెల్ మొబైల్ కాని విభాగంలో తన ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది.

కొత్త కంపెనీలో భారతీ ఎయిర్‌టెల్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండవచ్చు. భాగస్వామి ఛానల్ CNBC-ఆవాజ్‌కు చెందిన అసిమ్ మంచందా, వర్గాలను ఉటంకిస్తూ, దీని గురించి సమాచారం అందించింది. టాటా ప్లే – ఎయిర్‌టెల్ DTH విలీనం అవుతాయని తెలిపింది. రెండు కంపెనీల విలీనం షేర్ స్వాప్ ద్వారా చేయవచ్చు. కొత్త కంపెనీలో భారతీ ఎయిర్‌టెల్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో టాటా ప్లే రూ. 354 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఎయిర్‌టెల్‌ DTH  కూడా రూ.76 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఎయిర్‌టెల్ స్పందించలేదు. అంతకుముందు టాటా తన టెలికాం వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించింది.

టాటా ప్లే కనెక్షన్‌తో ఎయిర్‌టెల్ దాదాపు 2 కోట్ల మంది కస్టమర్లను పొందనుంది. భారతదేశంలో అతిపెద్ద DTH ప్రొవైడర్ టాటా స్కై. దీనిని టాటా ప్లేగా రీబ్రాండ్ చేశారు. ఇది న్యూస్ కార్ప్ తో జాయింట్ వెంచర్ గా ప్రారంభమైంది. 2019లో వాల్ట్ డిస్నీ 21వ శతాబ్దపు ఫాక్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత వాల్ట్ డిస్నీ దాని వాటాను స్వాధీనం చేసుకుంది. ఈ విలీనం వల్ల ఎయిర్‌టెల్ టాటా ప్లే కనెక్షన్‌తో దాదాపు 2 కోట్ల ఇళ్లకు చేరుకుంటుందని వర్గాలు తెలిపాయి. ఈ విలీనం వల్ల సర్వీస్ ప్రొవైడర్లు బ్రాడ్‌బ్యాండ్, టెలికాం, డిటిహెచ్‌లను ఒకే సబ్‌స్క్రిప్షన్‌గా కలపడానికి వీలు కలుగుతుంది. 2016లో వీడియోకాన్ D2H, డిష్ టీవీ విలీనం తర్వాత టాటా-ఎయిర్‌టెల్ విలీనం రెండవ అధిక రిస్క్ ఒప్పందం.

ఇది కూడా చదవండి: Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి OTTలు ఉచితం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రభాస్ సినిమాకు 17 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన డైరెక్టర్ మెహర్
ప్రభాస్ సినిమాకు 17 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన డైరెక్టర్ మెహర్
మజ్జిగ వీరికి విషంతో సమానం.. తాగితే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
మజ్జిగ వీరికి విషంతో సమానం.. తాగితే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
నా బౌలింగ్ మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్
నా బౌలింగ్ మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు