AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన AN-32 విమానం.. ఫైలట్ సహా ఐదుగురు మృతి!

అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. శనివారం (జూన్ 13) ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం నియంత్రణ కోల్పోయి ఎయిర్‌ఫీల్డ్ పరిధిలోనే కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, విమానంలో ఉన్న ఐదుగురు సిబ్బంది  ప్రాణాలు కోల్పోయారు. 

ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన AN-32 విమానం.. ఫైలట్ సహా ఐదుగురు మృతి!
An 32 Aircraft Crashes
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 1:22 PM

Share

అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. శనివారం (జూన్ 13) ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం నియంత్రణ కోల్పోయి ఎయిర్‌ఫీల్డ్ పరిధిలోనే కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫైలట్ సహా ఐదుగురు భారత వాయుసేన సిబ్బంది దుర్మరణం పాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, విమానంలో ఉన్న ఐదుగురు సిబ్బంది  ప్రాణాలు కోల్పోయారు.

భారత వైమానిక దళం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పైలట్లు ప్రమాదానికి ముందు “మే డే” ఎమర్జెన్సీ కాల్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది.

సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పక్షి ఢీకొనడం, రన్‌వేపై నీటి కారణంగా స్కిడింగ్ వంటి పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు విమానంలోని బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించనున్నారు. దాని ఆధారంగా ప్రమాదానికి అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

AN-32 అనేది సోవియట్ యూనియన్‌లో రూపొందించిన రెండు ఇంజన్లు కలిగిన టర్బోప్రాప్ మధ్యస్థ రవాణా విమానం. భారత వైమానిక దళం 1980ల నుంచి ఈ విమానాలను వినియోగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలను రవాణా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసేలా వీటిని రూపొందించారు.

ఈ విమానం గరిష్టంగా 7.5 టన్నుల సరుకును, 50 మంది ప్రయాణికులను లేదా 42 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రకృతి విపత్తులు, అత్యవసర సహాయక చర్యల సమయంలో కూడా AN-32 విమానాలను విస్తృతంగా వినియోగిస్తారు. జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ భారత వైమానిక దళానికి ఈశాన్య ప్రాంతంలో అత్యంత కీలకమైన స్థావరంగా గుర్తింపు పొందింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు, ప్రాణనష్టం అంశంపై అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us