AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం!

Chaturmas 2026: ఆషాఢ శుక్ల పక్ష దేవశయని ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ నాలుగు పవిత్ర నెలల్లో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని విశ్వాసం. ఈ సమయంలో తప్పక పాటించాల్సిన 5 ఆధ్యాత్మిక నియమాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం!
Chaturmas 2026 Begins
Rajashekher G
|

Updated on: Jul 26, 2026 | 12:12 PM

Share

Chaturmas Rules Telugu: ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష తొలి/దేవశయని ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని హిందూ సంప్రదాయంలో విశ్వసిస్తారు. దీంతో శనివారం జులై 25 నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలల పవిత్ర కాలం కార్తీక మాసంలోని శుక్ల పక్ష దేవుత్థాన (ప్రబోధిని) ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది చాతుర్మాసం జూలై 26 నుంచి నవంబర్ 20 వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం, ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉండగా, వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. అయితే ఈ సమయం భక్తి, ఆధ్యాత్మిక సాధన, దానం, ధ్యానం, జపం, పూజలు చేయడానికి అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో చేసే సత్కార్యాలకు విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని మత విశ్వాసం.

చాతుర్మాసంలో తప్పక పాటించాల్సిన ఆధ్యాత్మిక ఆచారాలు

1. విష్ణు సహస్రనామ పారాయణం

చాతుర్మాసం మొత్తం ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి గురువారం “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు.

2. తులసి పూజకు ప్రాధాన్యం ఇవ్వండి

ప్రతి సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి, తులసి మొక్కకు ప్రదక్షిణ చేయడం శుభప్రదంగా భావిస్తారు. చాతుర్మాసంలో తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఇంట్లో ధనధాన్యాలు, సౌభాగ్యం పెరుగుతాయని మత విశ్వాసం.

ఇవి కూడా చదవండి

3. విష్ణుమూర్తికి పసుపు రంగు నైవేద్యాలు సమర్పించండి

ప్రతి గురువారం శ్రీమహావిష్ణువుకు పసుపు రంగు పుష్పాలు, పసుపు వస్త్రాలు, శనగపిండి లడ్డూలు వంటి నైవేద్యాలను సమర్పించడం శుభకరంగా భావిస్తారు. అలాగే పేదలకు పసుపు, పసుపు వస్త్రాలు లేదా శనగపప్పు దానం చేయడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం.

4. ఏకాదశి ఉపవాసం పాటించండి

చాతుర్మాసంలో వచ్చే ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తితో ఆరాధించడం ఎంతో పుణ్యప్రదంగా చెబుతారు. గంగాజలంతో అభిషేకం చేసి, తులసి దళాలతో పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు.

5. గోసేవ, జీవదయ చేయండి

ఈ నాలుగు నెలల కాలంలో గోవులకు ఆహారం పెట్టడం, సేవ చేయడం, చీమలకు పిండి లేదా పంచదార వేయడం వంటి జీవదయ కార్యక్రమాలు చేయడం అత్యంత శ్రేష్ఠమైన పుణ్యకార్యాలుగా భావిస్తారు. ఇటువంటి సేవల వల్ల పాపక్షయం జరిగి, దైవానుగ్రహం లభిస్తుందని పురాణాలు పేర్కొంటాయి.

చాతుర్మాసం ఎందుకు ప్రత్యేకం?

చాతుర్మాసం అనేది కేవలం ఆచారాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవడానికి, సత్కార్యాలు చేయడానికి అత్యంత అనుకూలమైన కాలం. ఈ నాలుగు నెలల్లో నియమ నిష్ఠలతో భక్తి మార్గాన్ని అనుసరించడం వల్ల ఆధ్యాత్మిక పురోగతితో పాటు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన వివరాలు పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రాచీన మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని విశ్వాస పరంగా మాత్రమే పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us