Drishyam 3 : ఓటీటీలోకి సూపర్ హిట్ దృశ్యం 3.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..
నిజానికి భారతీయ సినీ ప్రపంచంలో దృశ్యం సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలు విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇటీవల దృశ్యం 3 సైతం అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో మోహన్ లాల్, మీనా, అన్సీబా హాసన్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మైండ్-బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి రెండు భాగాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. అదే క్రమంలో ఈ సిరీస్‌కు కొనసాగింపుగా భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దృశ్యం 3’ (Drishyam 3) ఇటీవల మే 21న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మలయాళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ (OTT) విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సస్పెన్స్ డ్రామాను జూన్ 18 నుంచి అందుబాటులోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక రిలీజ్ డేట్ త్వరలోనే వెలువడనుంది.
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
కథ విశేషాలు:
గత రెండు పార్టుల లాగే ఈ మూడో భాగం కూడా జార్జ్‌కుట్టి (మోహన్ లాల్) కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. వరుణ్ మర్డర్ కేసును పోలీసులు మళ్లీ రీసెర్చ్ చేయడం, జార్జ్‌కుట్టి పెద్ద కూతురు అంజు పెళ్లి సంబంధాలను కొందరు చెడగొట్టడానికి ప్రయత్నించడంతో కథ ఉత్కంఠగా మారుతుంది. తన కూతురిని కాపాడుకోవడానికి, పోలీసుల వ్యూహాల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి జార్జ్‌కుట్టి ఈసారి ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడాడు అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా హసన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం క్లైమాక్స్ ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో మిస్ అయిన వారు, ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మళ్లీ చూడాలనుకునే వారు ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
మిశ్రమ సమీక్షలతో ప్రారంభమైనప్పటికీ, ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 మలయాళ చిత్రాల జాబితాలోకి చేరింది. గత రెండు భాగాలను (దృశ్యం 1, దృశ్యం 2) తెలుగులో విక్టరీ వెంకటేష్, కన్నడలో రవిచంద్రన్ రీమేక్ చేసి మంచి విజయాలు అందుకున్నారు. అయితే, ఈ ‘దృశ్యం 3’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ చేయడం లేదని దర్శకుడు జీతూ జోసెఫ్ స్పష్టం చేశారు. ఈ చిత్ర క్లైమాక్స్ , ఎండింగ్ వేరే భాషల్లోని హీరోల ఇమేజ్‌కు సరిపోవడం లేదని ఆయన తెలిపారు. అయితే, హిందీలో మాత్రం అజయ్ దేవగన్ హీరోగా కొన్ని స్క్రిప్ట్ మార్పులతో ఈ చిత్రం రీమేక్ కానుంది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ..
Georgekutty and family awaits you ✨#Drishyam3OnPrime, June 18@mohanlal @jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk @aashirvadcine @PanoramaMovies @PenMovies @Rajeshmenon1969 pic.twitter.com/prBrniI6eN
— prime video IN (@PrimeVideoIN) June 13, 2026
ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..
