AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జున సినిమాకు ఆ టైటిల్ పెట్టానని తిట్టారు.. తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇప్పటికీ యూత్‏కు తెగ ఇష్టం..

దర్శకుడు విజయ భాస్కర్ తన సినిమాల పట్ల ఉన్న సామాజిక బాధ్యతను వివరించారు. మన్మథుడు, నువ్వే కావాలి చిత్రాల విజయ రహస్యాలు, నువ్వు నాకు నచ్చావ్లో డైలాగ్స్ పై పడిన శ్రద్ధను పంచుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్, పుష్ప వంటి సినిమాల్లోని కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

నాగార్జున సినిమాకు ఆ టైటిల్ పెట్టానని తిట్టారు.. తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇప్పటికీ యూత్‏కు తెగ ఇష్టం..
Vijay Bhaskar, Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Jun 13, 2026 | 12:34 PM

Share

దర్శకుడు విజయ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, దర్శకత్వ శైలి, వ్యక్తిగత ఆలోచనలను వివరించారు. నువ్వే కావాలి వంటి చిత్రాలు ఊహించని విజయాలను ఎలా సాధించాయో పంచుకుంటూ, తన దర్శకత్వంలో ఎప్పుడూ మౌలికత్వం, ప్రత్యేకతను కోరుకుంటానని వెల్లడించారు. “మన స్క్రిప్ట్ వేరు, మన కామెడీ వేరు, మన టైమింగ్ వేరు. ఇంకొకళ్ళని ఫాలో అవ్వకూడదు” అనే తన సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించారు. “యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్, నాట్ ఫర్ ది రిజల్ట్” అనే భగవద్గీత సూత్రాన్ని తాను నమ్ముతానని తెలిపారు. దర్శకుడిగా, తండ్రిగా తన బాధ్యతలను వివరిస్తూ, వృత్తిపరంగా తాను ఎంతో నిబద్ధతతో ఉంటానని, తండ్రిగా మాత్రం సులభంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. తాను సైనిక్ స్కూల్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, పిల్లలపై కఠినంగా ఉండటం ఇష్టపడనని చెప్పారు. తన కూతురు ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి తాను అంగీకరించినట్లు తెలిపారు, “ఎవరి నిర్ణయాలకు వారే బాధ్యులు” అనే తత్వాన్ని అనుసరిస్తానని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..

నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో వెంకటేష్, హేమ పాత్రల మధ్య ఒక చిన్న మాట విషయంలో కూడా ఎంతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మన్మథుడు టైటిల్ పెట్టినప్పుడు మహిళలు థియేటర్‌కు రారేమో అనిపించినప్పుడు, “హి హేట్స్ విమెన్” అనే క్యాప్షన్ ద్వారా ఒక కాంట్రాస్ట్ తీసుకువచ్చామని వివరించారు. దర్శకత్వం అనేది సామాజిక బాధ్యతతో కూడుకున్నదని, సినిమా మనసును ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.. టిక్కెట్ కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులను గౌరవించాలని, వారిని అలరించాలే తప్ప బాధపెట్టకూడదని అన్నారు. కొన్నిసార్లు థియేటర్‌లో సినిమాలు చూస్తున్నప్పుడు లేచి వచ్చేయాలనిపిస్తుందని, కుటుంబంతో కలిసి చూసే సినిమాలు తగ్గిపోతున్నాయని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

యువ దర్శకులకు ప్రపంచ సినిమాను అధ్యయనం చేయాలని, పుస్తకాలు చదవాలని పిలుపునిచ్చారు. లియో టాల్‌స్టాయ్ అన్నా కెరెనీనా వంటి రచనలు ఎంత గొప్ప స్క్రీన్‌ప్లేను కలిగి ఉన్నాయో వివరించారు. ఐన్ రాండ్, సెసిల్ బి. డెమిల్ వంటి రచయితలు, దర్శకుల నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..

Follow Us