Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక నుంచి OTTలు ఉచితం!
Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులు యాపిల్ టీవీ ప్లస్‌లోని అన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను ఎలాంటి యాడ్స్ లేకుండా వీక్షించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇవే కాకుండా వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయని ఎయిర్‌టెల్ తెలిపింది.

వినియోగదారులకు ఎయిర్‌టెల్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. టీవీ, సంగీతం కోసం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించింది. భారతీ ఎయిర్‌టెల్ తన హోమ్ Wi-Fi, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు Apple TV+, Apple Music లకు ఉచిత యాక్సెస్‌ను అందించడానికి Appleతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్లు ఆపిల్ ప్రీమియం వీడియోలు, సంగీతాన్ని ఉచితంగా వినే అవకాశం పొందుతారు. ఎయిర్‌టెల్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఓటీటీలు ఉచితంగా వాడుకునే అవకాశం లభించింది. యాపిల్ సంస్థకు చెందిన యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్ వంటి ఓటీటీలను ఎయిర్‌టెల్ యూజర్లు ఇక నుంచి ఉచితంగానే ఆస్వాధించవచ్చని ఎయిర్‌టెల్ సంస్థ ఒక ప్రకటన తెలిపింది. రూ.999తో ప్రారంభం అయ్యే రీఛార్జ్ ప్లాన్లపై హోమ్ వైఫై యూజర్లు అందరికీ ఈ యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. అంతే కాదు ఈ ప్లాన్‌లపై పోస్ట్‌పెయిడ్ యూజర్లు యాపిల్ టీవీ ప్లస్ సదుపాయాన్ని కూడా పొందవచ్చని వెల్లడించింది. వీటితో పాటు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్‌ను ఎయిర్‌టెల్ యూజర్లు ఉచితంగా పొందవచ్చని తెలిపింది. ఇందులో ఇండియన్ మ్యూజిక్‌తోపాటు ఫారిన్ మ్యూజిక్ లిస్టింగ్ కూడా ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.
ఎయిర్‌టెల్ వినియోగదారులు యాపిల్ టీవీ ప్లస్‌లోని అన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను ఎలాంటి యాడ్స్ లేకుండా వీక్షించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇవే కాకుండా వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయని ఎయిర్‌టెల్ తెలిపింది.
రూ.1099, రూ.1599, రూ.3999 ఎయిర్‌టెల్ వైఫై ప్లాన్ల సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వారికి 350కి పైగా టీవీ ఛానళ్లుతోపాటు వరుసగా 200 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్, 1 జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ లభించనుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌తో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








