Yamaha bikes: యమహా బైక్‌లపై సూపర్ ఆఫర్లు.. ఆ రెండు మోడళ్లపై భారీ తగ్గింపు

యమహా వాహన ప్రియులకు ఆ కంపెనీ గొప్ప శుభవార్త చెప్పింది. ఆర్ 3, ఎంటీ -03 బైక్ ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఫ్లాగ్ షిప్ మోడళ్ల ధరలను దాదాపు రూ 1.10 లక్షల మేర తగ్గించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ తగ్గింపు ధరలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇవి సవరించిన ధరలని, డిస్కౌంట్ స్టాక్ క్లియరెన్స్ సేల్ లో భాగం కాదని కంపెనీ వెల్లడించింది.

Yamaha bikes: యమహా బైక్‌లపై సూపర్ ఆఫర్లు.. ఆ రెండు మోడళ్లపై భారీ తగ్గింపు
Yamaha R3 Mt 03
Follow us
Srinu

|

Updated on: Feb 03, 2025 | 8:00 PM

ప్రీమియం బైక్ సెగ్మెంట్ లో తమ పరిధిని పెంచుకునేందుకు యమహా మోటార్ ఇండియా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఆర్ 3, ఎంటీ -03 బైక్ లను విడుదల చేసింది. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం యమహా ఆర్ 3 రూ.3.60 లక్షలు, యమహా ఎంటీ 3 రూ.3.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) కు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు మోటారు సైకిళ్లు 321 సీసీ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో అందుబాటులోకి వచ్చాయి. ఇంజిన్ నుంచి 41 హెచ్ పీ పవర్, 29.5 ఎన్ ఎం టార్కు ఉత్పత్తి అవుతుంది. అలాగే సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. ఆర్ 3 బైక్ ఐకాన్ బ్ల్యూ, యమహా బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎంటీ 03 బైక్ మాత్రం మిడ్ నైట్ సియాన్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

యమహా నుంచి విడుదలయ్యే ద్విచక్ర వాహనాలంటే యువతకు చాలా ఇష్టం. వారికి అవసరమైన బైక్ లను తయారు చేయడానికి కంపెనీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. దానిలో భాగంగా గతేడాది యమహా ఆర్ 3, ఎంటీ -03 బైక్ లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి రైడింగ్ చేయడానికి బాగున్నప్పటికీ, అద్భుతమైన లుక్కింగ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. డీలర్ల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో అమ్ముడు పోని ఇన్వెంటరీ ఉండిపోయింది. దీంతో వినియోగదారులను ఆకర్షించడానికి తాజాగా తగ్గింపు ధరలు ప్రకటించింది.

యమహా ఆర్ 3, ఎంటీ 03 పేరుగల రెండు మోటారు సైకిళ్లు చాలా అద్బుతమైన పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. బలమైన టాప్ ఎండ్ ఇంజిన్, మంచి డిజైన్ తో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ధర ఎక్కువగా ఉండడంతో పూర్తిస్థాయిలో ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు కొత్తగా తగ్గించిన ధరలతో కొనుగోళ్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు. యమహా ఆర్ 3 మోటారు సైకిల్ ధరను తగ్గించడంతో ప్రస్తుతం కవాసాకి నింజా 300కి దగ్గరలో ఉంది. అలాగే అప్రిలియా ఆర్ 457 బైక్ కంటే రూ.40 వేలు తక్కువ ధరకు చేరింది. ఇక యమహా ఎంటీ 03 బైక్ కు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి మార్కెట్ లో ప్రత్యక్ష్య ట్విన్ సిలిండర్ స్ట్రీట్ ఫైటర్ ప్రత్యర్థి ఎవ్వరూ లేరు. అయితే త్వరలో రాబోయే అప్రిలియా టుయోనో 457కి పోటీగా ఉంటుంది. అలాగే కేటీఎం 390 డ్యూక్ కు ప్రత్యామ్నాయంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి