Decathlon Rock Rider : డెకాథ్లాన్ నుంచి సూపర్ ఈవీ సైకిల్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
డెకాథ్లాన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. రాక్‌రైడర్ ఈఎస్టీ 100 పేరుతో ఈవీ సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని మూడు స్టోర్లలో 150 యూనిట్ల ఈ-సైకిళ్లను అందుబాటులో ఉంచింది.

భారతదేశంలోని ప్రముఖ క్రీడా వస్తువుల బ్రాండ్స్‌లో ఒకటైన డెకాథ్లాన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. రాక్‌రైడర్ ఈఎస్టీ 100 పేరుతో ఈవీ సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని మూడు స్టోర్లలో 150 యూనిట్ల ఈ-సైకిళ్లను అందుబాటులో ఉంచింది. ఈ కొత్త . రాక్‌రైడర్ ఈఎస్టీ 100 ఎలక్ట్రిక్ సైకిల్ ధర మాత్రం భారీగా ఉంది. ఈ స్కూటర్‌ను భారతదేశంలో రూ.84,999కు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సైకిల్ స్పెసిఫికేషన్ల విషయానికి ఈ సైకిల్ 42 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ సైకిల్ 250 వాట్స్ మోటార్‌తో అమర్చి ఉంటుంది. ఈ సైకిల్ గంటకు 25 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో వేరు చేయగలిగిన 380 డబ్ల్యూహెచ్ శామ్‌సంగ్ లిథియం-అయాన్ సెల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ పూర్తి చార్జ్ చేయడానికి ఆరు గంటల సమయం పడుతుంది. ఈ సైకిల్ మోడ్ 1లో ఒకే ఛార్జ్‌పై 100 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.
రాక్‌రైడర్ ఈఎస్టీ 100 ఎలక్ట్రిక్ సైకిల్ ఏఆర్ఏఐ ధ్రువీకరణ ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాటరీ భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి బీఐఎస్ సర్టిఫికేట్ పొందింది. ఈ ఈ-సైకిల్ విభిన్న రైడర్ ఎత్తులకు సరిపోయేలా మీడియం, లార్జ్ అనే రెండు ఫ్రేమ్ సైజులలో అందిస్తుంది. డెకాథ్లాన్ సైకిల్ మూడు రకాల పెడల్ సహాయాన్ని పొందుతుంది. ఎకో, స్టాండర్డ్, బూస్ట్ మోడ్స్‌లో వస్తుంది. కంపెనీ ఫ్రేమ్‌పై జీవితకాల వారంటీని, బ్యాటరీ ప్యాక్‌పై 2 సంవత్సరాలు లేదా 500 ఛార్జింగ్ సైకిల్స్ వారంటీని అందిస్తోంది. డెకాథ్లాన్ స్పోర్ట్స్ ఇండియా ఈ-సైకిల్ ప్రాజెక్ట్ లీడర్ ఎబిన్ మాథ్యూ మాట్లాడుతూ, డెకాథ్లాన్ యొక్క అత్యంత చురుకైన సైక్లింగ్‌కు నిలయమైన బెంగళూరు నగరంలో మేము మొట్టమొదటిసారిగా రాక్‌రైడర్ ఈ ఎస్టీ 100 ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. డెకాథ్లాన్‌లో స్థిరమైన రవాణాను ప్రోత్సహించడానికి, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..