Electric cycle: యాప్‌తో నియంత్రించగలిగే ఎలక్ట్రిక్ సైకిల్.. భారత మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ..
యాప్ ద్వారా నియంత్రించ గలిగే సరికొత్త ఈ- సైకిల్ ను అర్బన్ ఎకో పేరిట ఫైర్ ఫాక్స్ కంపెనీ భారతీయ మార్కెట్లో కి విడుదల చేసింది. ఈ-బైక్ దిగ్గజం HNF సంస్థ ఈ సైకిల్ ను జర్మన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించింది.

సైక్లింగ్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. అయితే ఆధునిక కాలంలో ఇది చాలా తక్కువ వినియోగంలో ఉంది. స్కూల్ విద్యార్థులు తప్ప ఎవరూ సైకిల్ ని వినియోగించడం లేదు. ఈ క్రమంలో సైకిల్ తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను అప్ గ్రేడ్ చేస్తున్నాయి. బ్యాటరీ సాయంతో నడిచే ఈ -సైకిళ్లుగా వాటిని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. ఇదే క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ సైకిల్ తయారీదారు ఫైర్ ఫాక్స్ తొలిసారిగా భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిల్ ను విడుదలు చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జర్మన్ సాంకేతికతతో..
యాప్ ద్వారా నియంత్రించ గలిగే సరికొత్త ఈ- సైకిల్ ను అర్బన్ ఎకో పేరిట ఫైర్ ఫాక్స్ భారతీయ మార్కెట్లో కి విడుదల చేసింది. ఈ-బైక్ దిగ్గజం HNF సంస్థ ఈ సైకిల్ ను జర్మన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించింది. ఇది 10Ah కెపాసిటీ బ్యాటరీ ప్యాక్‌తో 90 కిమీల పెడల్ అసిస్ట్ రేంజ్‌ను అందిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. ఫైర్‌ఫాక్స్ అర్బన్ ఎకో ఎలక్ట్రిక్ సైకిల్ థ్రోటిల్ ద్వారా గంటకు 25 కి.మీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ వివరించింది.
యాప్ ద్వారా నియంత్రణ..
అర్బన్ ఎకో అనేది యాప్-నియంత్రిత ఇ-బైక్, దీనిని ఫిట్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ యాప్ ద్వారా, రైడర్ తన వేగం, ప్రయాణించిన దూరం, శరీరం నుంచి ఖర్చు చేసిన కేలరీలు, హార్ట్ బీట్ రేటును ట్రాక్ చేయవచ్చు, అలాగే రైడర్ తన వ్యాయామం, రైడింగ్ శైలిని ట్రాక్ చేయడంలో నూ సహాయపడుతుంది. ఈ సైకిల్ లో ఐదు పెడల్ అసిస్ట్ మోడ్‌లు ఉన్నాయి. మెరుగైన స్టాపింగ్ పవర్ కోసం రెండు చివర్లలో ఫ్లాట్ హ్యాండిల్ బార్, ఎర్గోనామిక్ గ్రిప్స్, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా , ఎలక్ట్రిక్ సైకిల్‌లో సింగిల్ పవర్ బటన్ కూడా ఉంది.
స్పెసిఫికేషన్లు..
అర్బన్ ఎకో ఇ-బైక్ 10Ah బ్యాటరీలో ప్యాక్ వస్తుంది. ఇది పెడల్ అసిస్ట్‌ని ఉపయోగించి 90 కిమీల పరిధిని అందించగలదు. కేవలం థొరెటల్‌ని ఉపయోగించి గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దీనిని నడపవచ్చు. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది.
ధర ఎంతంటే..
ఫైర్ ఫాక్స్ అర్బన్ ఎకో భారతదేశంలో రూ. 74,999 ధరతో ప్రారంభం అవుతోంది. ఒక్క గ్రే కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఈసైకిల్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు దానిని ఆఫ్‌లైన్‌లో ఫైర్ ఫాక్స్ అధికారిక వెబ్‌సైట్ నుంచి లేదా Paytm ద్వారా బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..