Sukanya Samriddhi Yojana: పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ.. ఆడపిల్లల తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్
ముఖ్యంగా బాలికల విద్యకు తోడ్పాటునందించేలా అలాగే బాల్య వివాహాలను అరికట్టే ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పేరిట పెట్టుబడి స్కీమ్‌ను ఇప్పటికే ప్రవేశ పెట్టింది. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆ పథకం గురించి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్ అవసరాలను దృష్టి ఉంచుకుని పెట్టుబడి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రలు అయితే వారి పెళ్లి, చదువుకు ఆసరాగా ఉంటుందని ఎక్కువగా సొమ్ము దాచుకునేందుకు ముందుకు వస్తారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా వివిధ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా బాలికల విద్యకు తోడ్పాటునందించేలా అలాగే బాల్య వివాహాలను అరికట్టే ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పేరిట పెట్టుబడి స్కీమ్‌ను ఇప్పటికే ప్రవేశ పెట్టింది. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆ పథకం గురించి వివరాలను ఓ సారి తెలుసుకుందాం. ఆర్థిక సమానత్వ స్థిరత్వం సాధించడం మహిళలకు చాలా అవసరం. కాబట్టి మహిళలకు ఆర్థికపరంగా ఊతమిచ్చేలా ఈ పథకం అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెడితే కచ్చితంగా ఉన్నత చదువు సమయంలో ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే..?
సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని 2015లో ప్రారంభించారు. బేటీ బచావో, బేటి పఢావో ప్రచారం కింద ప్రారంభించిన ఈ పొదుపు పథకం సాయంలో తల్లిదండ్రలు తమ ఆడపిల్లల కోసం ఆధీకృత వాణిజ్య బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు. ఎస్ఎస్‌వై ఖాతాలకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీరు మీ పెట్టుబడి, వ్యవధి ఆధారంగా మీ రాబడిని తెలుసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన అర్హత
- ఈ పథకంలో ఖాతా తీసుకోవాలంటే అమ్మాయి కచ్చితంగా భారతపౌరురాలు అయ్యి ఉండాలి.
- అమ్మాయి వయస్సు ఖాతా తీసుకునే సమయానికి పదేళ్లకు మించి ఉండకూడదు.
- సుకన్య సమృద్ధి యోజన ఖాతా కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే తెరుస్తారు.
సుకన్య యోజన పథకంలో పెట్టుబడిని లెక్కించడం ఇలా
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఓ ఖాతాదారుడు అర్హులై ఉంటే.. ఆడపిల్ల వయస్సుతో పాటు పెట్టిన పెట్టుబడి ఆధారంగా రాబడి ఉంటుంది. సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఉదాహరణకు మీరు పది సంత్సరాల కాలనికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. లక్ష అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 మొత్తం మీకు అందుతుంది.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి




