SBI Sarvottam Scheme: ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్.. రెండేళ్లకు అందించే వడ్డీ ఎంతో తెలుసా?
ఎస్‌బీఐ సర్వోత్తం టర్మ్ డిపాజిట్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకంలో రెండేళ్లు మీ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏకంగా 7.9 శాతం వడ్డీని అందిస్తామని పేర్కొంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీని అందించే పథకం ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును పెట్టుబడి లేదా దాచుకోవడానికి మంచి మార్గం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎలాంటి రిస్క్‌ల్లేని పెట్టుబడి మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. నమ్మకమైన రాబడి ఏయే సంస్థలు ఇస్తాయో? అని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పోస్టాఫీస్‌లోని పీపీఎఫ్, ఎన్‌ఎస్సీతో పాటు ఎక్కడా లేనంత వడ్డీ రేట్‌ను ఆఫర్ చేస్తుంది. ఎస్‌బీఐ సర్వోత్తం టర్మ్ డిపాజిట్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకంలో రెండేళ్లు మీ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏకంగా 7.9 శాతం వడ్డీని అందిస్తామని పేర్కొంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీని అందించే పథకం ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సర్వోత్తం పథకంలో పెట్టుబడి పెట్టిన సీనియార్ సిటిజన్లకు 7.9 శాతం వడ్డీని ఎస్‌బీఐ ఆఫర్ చేస్తే సాధారణ ప్రజలకు 7.4 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే ఒక సంవత్సర కాలానికి ఈ పథకంలో డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, సాధారణ ప్రజలకు 7.1 శాతం వడ్డీ లభించనుంది. ఈ మేరకు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే ఈ సవరించిన డిపాజిట్ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఉన్న రెండు సంవత్సరాల సర్వోత్తమ్ డిపాజిట్లపై వార్షిక రాబడి 8.14% కాగా, సీనియర్ సిటిజన్‌లకు 1-సంవత్సరపు డిపాజిట్ 7.6%. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల బల్క్ డిపాజిట్లపై, సీనియర్ సిటిజన్లకు 1 సంవత్సరానికి 7.55%, 2 సంవత్సరాలకు 7.4% వడ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది.
ఎస్‌బీఐ ఇటీవల రెగ్యులర్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లకు 2 సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల కంటే తక్కువ, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లపై 7.5% వడ్డీని అందిస్తోంది. అయితే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ కింద తీసుకొచ్చిన అమృత్ కలశ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, సాధారణ ప్రజలకు 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే వీటన్నిటికంటే ఎస్‌బీఐ సర్వోత్తం స్కీమ్‌లో ఎక్కువ లాభాన్ని సీనియర్ సిటిజన్లు ఆర్జించగలరు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..