Small savings scheme: మీరు దాచుకునే డబ్బు తక్కువ టైంలోనే రెట్టింపు చేసుకునే అవకాశం.. ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే బెటర్ స్కీమ్..
చాలా మంది తమ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు మార్గాన్ని ఎంచుకుంటారు. సాధారణంగా మన డబ్బులు మన దగ్గర దాచుకుంటే మనం ఎంత దాచుకుంటే అంతే ఉంటుంది. అదే ఆదాయం కోసం బయట వడ్డీలకు ఇస్తే మన నగదుకు ఎటువంటి భద్రత ఉండకపోవచ్చు. ఎక్కువ..
చాలా మంది తమ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు మార్గాన్ని ఎంచుకుంటారు. సాధారణంగా మన డబ్బులు మన దగ్గర దాచుకుంటే మనం ఎంత దాచుకుంటే అంతే ఉంటుంది. అదే ఆదాయం కోసం బయట వడ్డీలకు ఇస్తే మన నగదుకు ఎటువంటి భద్రత ఉండకపోవచ్చు. ఎక్కువ మందికి పొదుపు చేసుకోవడానికి ఎటువంటి పథకాలు ఉన్నాయో అవగాహన లేకపోవడంతో చాలా మంది తమ డబ్బులను షేర్ మార్కెట్లలో లేదా ఇతర రిస్క్ ఉన్న పథకాల్లో పెట్టి ఒక్కోసారి నష్టపోతుంటారు. కాని మన నగదు అతి తక్కువ కాలంలో రెట్టింపు అయ్యే పథకాలు ఎన్నో ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్న వడ్డీ రేట్ల కంటే మెరుగైన పథకాలు ఉన్నాయి. మనం పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగ ఉండటంతో పాటు తక్కువ నెలల్లోనే రెట్టింపు అవుతుంది. ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఇస్తుండటంతో స్థిర ఆదాయ వర్గాలు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈఏడాది అక్టోబర్ నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) వడ్డీ రేట్లను 80 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరుగుదల తర్వాత, భారతీయ స్టేట్ బ్యాంకు సాధారణ ప్రజలకు గరిష్ట వడ్డీని అందిస్తోంది. 2 నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.25% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 5 నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై గరిష్ట వడ్డీ రేటు 6.90% అందిస్తోంది. అయితే దీనికంటే మెరుగైన వడ్డీ రేట్ల కోసం చూస్తున్న స్థిర ఆదాయ వర్గాల కోసం కిసాన్ వికాస్ పత్ర, పోస్టాఫీసు పొదుపు పథకం పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేయడమే కాకుండా, భారతీయ స్టేట్ బ్యాంకు అందిస్తున్న ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే గణనీయంగా ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది.
కిసాన్ వికాస్ పత్ర
భారత ప్రభుత్వం అందిస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. పథకం యొక్క వ్యవధిలో పెట్టుబడి మొత్తం 123 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. అంటే కేవలం 10 సంవత్సరాల 3 నెలల్లో మనం పొదుపు చేసిన మొత్తం డబుల్ అవుతుంది. దేశంలోని ఏదైనా పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ. 1000 గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఒకే వ్యక్తి ఎన్ని ఖాతాలు అయినా ఓపెన్ చేయవచ్చు. అనేక చిన్న పొదుపు పథకాలపై, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు) లేదా ఆర్థిక సంవత్సరం 2023కి ప్రభుత్వం వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచింది. కిసాన్ వికాస్ పత్ర (కెవిపి) కాల వ్యవధి, వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరించింది. మునుపటి వడ్డీ రేటు 6.9 శాతం కాగా 124 నెలల మెచ్యూరిటీ వ్యవధితో పోల్చితే, ప్రస్తుతం ఒక నెల కాల వ్యవధిని తగ్గించడంతో పాటు ఈ పథకానికి వడ్డీ రేటును 7 శాతానికి పెంచింది. దీంతో ఈపథకం కింద వచ్చే వడ్డీ రేటు అనేక బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ రేట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఈపథకంలో ఈరోజు (04-11-2022) లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే జనవరి 5 వతేదీ 2032న మెచ్యూర్ అయినప్పుడు రూ.2 లక్షలు వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..