SBI Life: మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా.? ఈ పాలసీలపై ఓ లుక్కేయండి..

ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత మొత్తాన్ని దాచాలనే దృక్పథం అందరిలోనూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు..

SBI Life: మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా.? ఈ పాలసీలపై ఓ లుక్కేయండి..
Sbi Life
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 09, 2022 | 10:34 AM

ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత మొత్తాన్ని దాచాలనే దృక్పథం అందరిలోనూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ముందు నుంచే డబ్బును దాచుకుంటున్నారు. పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే డబ్బులు జమ చేయడం ఒక్కటనే మార్గమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రెండు పథకాలను తీసుకొచ్చింది. ఎస్‌బీఐ లైప్‌ స్మార్ట్‌ స్కాలర్‌, ఎస్‌బీఐ లైఫ్‌ స్మార్ట్‌ చాంప్‌ అనే రెండు పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

SBI లైఫ్- స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్..

ఈ పథకం ద్వారా నెలవారీ, త్రైమాసికం, హాఫ్‌ ఇయర్‌, ఇయర్లీగా పెట్టుబడి పెట్టొచ్చు. 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారెవరైనా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయొచ్చు. అయితే పిల్లల వయసు మాత్రం 0 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పాలసీ మెచ్యూరిటీ కాల వ్యవధి 21 ఏళ్లుగా ఉంటుంది. బిడ్డకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని 4 వార్షిక వాయిదాల్లో తీసుకొవచ్చు. అంటే 18 నుంచి 21 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రతీ ఏటా 25 శాతం చొప్పున తీసుకొవచ్చన్నమాట. ఈ పథకం ద్వారా డబ్బు జమ చేసుకోవడంతో పాటు బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది. అనుకోనిది ఏదైనా జరిగితే ప్లాన్‌ కింద హామీ మొత్తంలో 100 శాతం వరకు బీమాగా పొందొచ్చు.

ఎస్‌బీఐ స్మార్ట్ స్కాలర్‌..

ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలంటే తల్లిదండ్రులు 18 నుంచి 57 ఏళ్ల కలిగి ఉండాలి. అలాగే పిల్లలు 0 నుంచి 17 ఏళ్ల మధ్య ఉండాలి. పాలసీలో కనీసం 8 ఏళ్ల గరిష్టంగా 25 ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. ఇక ఈ పాలసీ 18 నుంచి 25 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు 65 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ పొందుతుంది. ఈ పాలసీలో చేరిన వారు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా పాలసీ దారలకు బీమా కూడా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!