Stock Market: స్టాక్ మార్కెట్లకు ‘ఫెడ్’ దెబ్బ.. భారీగా పతనమైన సూచీలు..

ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 600 పాయింట్ల వరకు ఎగబాకింది. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్ల వరకు నష్టాల్లోకి వెళ్లింది. మొత్తంగా నేటి గరిష్ట స్థాయి నుంచి..

Stock Market: స్టాక్ మార్కెట్లకు 'ఫెడ్' దెబ్బ.. భారీగా పతనమైన సూచీలు..
Stock Market
Follow us

|

Updated on: Jun 16, 2022 | 4:39 PM

అమెరికాలో వడ్డీ రేట్ల రికార్డు పెరుగుదలతో, ఆర్థిక మందగమన భయాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం కొద్దిసేపటికే ప్రారంభ జోరును కోల్పోయింది. గత కొన్ని రోజులుగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు పతనమవుతున్నాయి. పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం లభిస్తుందని, అనుకున్నా.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మార్కెట్‌ కుప్పకూలింది. సెన్సెక్స్, నిఫ్టీలు వారంలోని నాల్గవ ట్రేడింగ్ రోజును పతనంతో ముగించాయి. సెన్సెక్స్ రోజు గరిష్టానికి 1600 పాయింట్లు దిగువన ముగిసింది. 1045.60 పాయింట్లు లేదా 1.99% క్షీణించి 51,495.79 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇది 331.55 పాయింట్లు లేదా 2.11% క్షీణతను చూసింది. 15,360.60 వద్ద ముగిసింది. మెటల్, ఐటీ, బ్యాంక్ షేర్లలో అత్యధిక పతనం నమోదైంది. కాగా ఉదయం మార్కెట్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది.

భారీగా పతనం..

అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత, నిన్న అమెరికా స్టాక్ మార్కెట్ భారీ స్థాయిలో పడిపోయింది. యూఎస్ మార్కెట్ బూమ్ కారణంగా దేశీయ మార్కెట్ కూడా ఈరోజు బాగానే ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒకప్పుడు 600 పాయింట్ల వరకు ఎగబాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,045.60 పాయింట్లు (1.99 శాతం) క్షీణించి 51,495.79 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 53,142.50 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుని, 51,425.48 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ విధంగా, ఈ రోజు సెన్సెక్స్‌లో 1,700 పాయింట్లకు పైగా అస్థిరత ఉంది.

ఇవి కూడా చదవండి

ఏడాది కనిష్టానికి మార్కెట్..

సెన్సెక్స్, నిఫ్టీలు 1 శాతానికి పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 09:20 గంటలకు సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా లాభంతో 53 వేల పాయింట్లకు పైగా ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 150 పాయింట్లు జంప్ చేసి 15,850 పాయింట్ల దగ్గర ఉంది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 640 పాయింట్లకు పైగా (1.22 శాతం) నష్టంతో 51,900 పాయింట్లకు పడిపోయింది. 2:45 సమయానికి సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాల్లోకి వెళ్లింది. ఇదే మార్గంలో నిఫ్టీ దాదాపు 225 పాయింట్లు పతనమై 15,465 పాయింట్లకు చేరుకుంది. జూలై 2021 తర్వాత దేశీయ మార్కెట్‌లో ఇదే కనిష్ట స్థాయిగా నిలిచింది.

తీవ్రమైన మాంద్యం ఏర్పడే అవకాశం..

రికార్డు స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. దాదాపు మూడు దశాబ్దాలలో USలో వడ్డీ రేట్ల పెరుగుదల ఇదే అతిపెద్దదిగా నిలిచింది. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు 1.50-1.75 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం, అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 8.6 శాతంగా ఉంది. ఇది దాదాపు 40 ఏళ్లలో అత్యధికం. ఫెడరల్ రిజర్వ్ దీన్ని 2 శాతానికి తగ్గించాలని కోరుతోంది. ఈ కారణంగా, ఆర్థిక వ్యవస్థ నుంచి లిక్విడిటీని తగ్గించడానికి, డిమాండ్‌ను నియంత్రించడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచుతోంది. అయితే, దీనితో, వడ్డీ రేట్లు వేగంగా పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రమాదం మరింత తీవ్రంగా మారుతుంది.

గుమ్మడికాయ తొక్కలతో టేస్టీ టేస్టీ చిప్స్..! హెల్తీ స్నాక్ ఐటమ్
గుమ్మడికాయ తొక్కలతో టేస్టీ టేస్టీ చిప్స్..! హెల్తీ స్నాక్ ఐటమ్
బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే