SBI: వినియోగదారులకు మరోసారి షాకిచ్చిన ఎస్‌బీఐ.. కస్టమర్లకు మరింత భారం
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తన కోట్లాది కస్టమర్లకు షాక్ ఇస్తూ మరోసారి రుణాన్ని ఖరీదైనదిగా చేసింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తన కోట్లాది కస్టమర్లకు షాక్ ఇస్తూ మరోసారి రుణాన్ని ఖరీదైనదిగా చేసింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను పెంచింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 1 సంవత్సరం పాటు పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు తర్వాత వినియోగదారులు గృహ రుణం, కారు రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణం వంటి అన్ని రకాల రుణాలపై అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది కస్టమర్లు తమ రుణాన్ని ఒక సంవత్సర కాలానికి ఎంసీఎల్‌ఆర్ ఆధారంగా మాత్రమే ఆమోదించడం సాధారణంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ నిర్ణయం కోట్లాది వినియోగదారులకు మరింత భారం పడనుంది.
10 బేసిస్ పాయింట్ల పెంపు
ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. బ్యాంక్ ఒక సంవత్సరం కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. గతంలో బ్యాంకు 1 సంవత్సరం రుణంపై 8.30 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయగా, ఇప్పుడు అది 8.40 శాతానికి పెరిగింది. అటువంటి పరిస్థితిలో ఈ పెరుగుదల కారణంగా మీరు మీ హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన అన్ని రకాల లోన్‌లపై ఎక్కువ ఈఎంఐ కాస్త ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. వివిధ కాలాలకు ఎంసీఎల్‌ఆర్ రేటు ఎలా ఉందంటే..
ఓవర్ నైట్ ఎంసీఎల్‌ఆర్ – 7.85 శాతం
1 నెల ఎంసీఎల్‌ఆర్ – 8.00 శాతం
3 నెలలకు ఎంసీఎల్‌ఆర్ – 8.00 శాతం
6 నెలల ఎంసీఎల్‌ఆర్ – 8.30 శాతం
1 సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ – 8.40 శాతం
2 సంవత్సరాలకు ఎంసీఎల్‌ఆర్ – 8.50 శాతం
3 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్ – 8.60 శాతం