AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: ఎగుమతుల్లో స్మార్ట్ ఫోన్స్ రికార్డు.. ప్రభుత్వ నివేదికలో సంచలన నిజాలు

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఉత్పత్తి రంగంలో వేగంగా వృద్ధి చెందింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉత్పత్తి భారీగా పెరిగింది. దీంతో స్మార్ట్ ఫోన్స్ ఉత్పత్తి తారాస్థాయికు చేరింది. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే రెండో అతి పెద్ద ఎగుమతిగా స్మార్ట్ ఫోన్లు నిలిచాయి.

Smart Phone: ఎగుమతుల్లో స్మార్ట్ ఫోన్స్ రికార్డు.. ప్రభుత్వ నివేదికలో సంచలన నిజాలు
Smart Phones Exports
Nikhil
|

Updated on: Jan 23, 2025 | 5:15 PM

Share

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య వర్గీకరణ కోసం ఉపయోగించే హార్మోనైజ్డ్ సిస్టమ్ (హెచ్ఎస్) కోడ్‌ల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశానికి సంబంధించిన రెండో అతిపెద్ద ఎగుమతి వర్గంగా మారిందని పేర్కొన్నాయి. ఆటోమోటివ్ డీజిల్ ఇంధన ఎగుమతులను సవాలు చేస్తూ ఈ విభాగం ఇప్పుడు అగ్రస్థానం కోసం పోటీపడుతున్నట్లు విశ్లేషించింది. 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 13.1 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయని హెచ్ఎస్ కోడ్ ఆధారిత ఎగుమతి వర్గాలలో రెండవ స్థానాన్ని పొందిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులలో 8.9 బిలియన్ల డాలర్ల కంటే 46 శాతం పెరుగుదలను సూచిస్తుందని విశ్లేషించింది 2024 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్‌లు ఏప్రిల్-నవంబర్ కాలంలో నాలుగో స్థానంలో ఉన్నాయి కానీ ఇప్పుడు రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాయి. 

యాపిల్ కంపెనీకు చెందిన ఐఫోన్ ఎగుమతుల్లో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ కారణంగానే ఇది సాధ్యమైందని నిపుణుుల చెబుతున్నారు. ఆటోమోటివ్ డీజిల్ ఇంధనం భారతదేశం యొక్క అగ్ర ఎగుమతిగా ఉంది. ఏప్రిల్-నవంబర్ 2024 ఆర్థిక సంవత్సరంలో  స్మార్ట్‌ఫోన్‌ల కంటే 10 బిలియన్ల డాలర్లు ఉంది.  అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ అంతరం సంబంధిత కాలానికి కేవలం 400 మిలియన్ల డాలర్లకు తగ్గింది.

2019 ఆర్థిక సంవత్సరం నుంచి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు చెప్పుకోదగిన వృద్ధిని సాధించాయి. అప్పట్లో 1.6 బిలియన్ల డాలర్లతో హెచ్ఎస్ కోడ్ ఎగుమతి వర్గాల్లో 23వ స్థానంలో నిలిచాయి. రెండు సంవత్సరాల తర్వాత పీఎల్ఐ స్కీమ్‌ను ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో ప్రధాన ఐఫోన్ తయారీ కేంద్రాలను స్థాపించిన యాపిల్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ప్రపంచ దిగ్గజాలను ఆకర్షించింది. అలాగే ప్రముఖ కంపెనీ సామ్‌సంగ్ కూడా తన ఎగుమతి కార్యకలాపాలను కూడా విస్తరించింది. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2020 ఆర్థిక సంవత్సరంలో 2.9 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. ఎగుమతి ర్యాంకింగ్స్‌లో ఈ రంగం 14వ స్థానంలో ఉంది. తర్వాత రెండు సంవత్సరాల్లో ఎగుమతులు ఊపందుకున్నాయి. 

ఇవి కూడా చదవండి

2021 ఆర్థిక సంవత్సరంలో 3 బిలియన్ల డాలర్లకు, 2022 ఆర్థిక సంవత్సరంలో 5.7 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పథం మరింత వేగవంతమైంది. యాపిల్‌కు సంబంధించిన ముఖ్య విక్రయదారులైన టాటా, పెగాట్రాన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. దీంతో 2023 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విలువ దాదాపు 11 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 15.6 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. ఆటోమోటివ్ డీజిల్ ఇంధనం, వజ్రాలు, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వెనుక నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఏప్రిల్-డిసెంబర్ 2025 ఆర్థిక సంవత్సరం ఎగుమతి ర్యాంకింగ్‌లు ఇంకా విడుదల కానప్పటికీ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే 15.35 బిలియన్ల డాలర్ల విలువైన ఎగుమతులను సాధించాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..