Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన అరుదైన గౌరవం.. ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్‌తో చారిత్రాత్మక భేటీ

ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ గారు ప్రపంచ ఆర్థిక వేదికను స్థాపించి, నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన స్ఫూర్తిదాయక నేత. ప్రపంచ ఆర్థిక విధానాలను, సాంకేతిక అభివృద్ధిని, స్థిరమైన అభివృద్ధిని సమన్వయం చేసే ఆయన దూరదృష్టి, ఆలోచనా సరళి ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రభుత్వాలకు, పరిశ్రమలకు మార్గ నిర్దేశం చేస్తోంది.

మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన అరుదైన గౌరవం.. ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్‌తో చారిత్రాత్మక భేటీ
Follow us
Subhash Goud

|

Updated on: Jan 22, 2025 | 10:11 PM

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వ్యవస్థాపకుడు, ప్రపంచ ఆర్థిక విధానాలను ఆవిష్కరించిన గొప్ప మహనీయుడైన ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ గారితో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దావోస్‌లో నిర్వహించిన చారిత్రాత్మక సమావేశం తెలంగాణ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్న దశలో మరొక ముఖ్య ఘట్టంగా నిలిచింది. ఈ సమావేశం తెలంగాణ భవిష్యత్తును అంతర్జాతీయ స్థాయిలో మరింత పైకే తీసుకెళ్లే ప్రణాళికలకు బలమైన పునాది వేయనుంది.

ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ గారి ప్రాధాన్యత:

ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ గారు ప్రపంచ ఆర్థిక వేదికను స్థాపించి, నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన స్ఫూర్తిదాయక నేత. ప్రపంచ ఆర్థిక విధానాలను, సాంకేతిక అభివృద్ధిని, స్థిరమైన అభివృద్ధిని సమన్వయం చేసే ఆయన దూరదృష్టి, ఆలోచనా సరళి ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రభుత్వాలకు, పరిశ్రమలకు మార్గ నిర్దేశం చేస్తోంది.

సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు:

– తెలంగాణ – భారత ఆవిష్కరణల రాజధానిగా ఎదగడంలో కీలకమైన అంశాలు.

– కృత్రిమ మేధస్సు (AI), క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ప్రగతి.

– భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర.

– స్థిరమైన అభివృద్ధి, వనరుల సమతుల్యంతో కూడిన తెలంగాణ ఆర్థిక వ్యూహాలు.

ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ ప్రశంసలు:

ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ గారు తెలంగాణ ప్రగతిని అత్యంత ప్రశంసనీయంగా అభివర్ణిస్తూ, ఈ రాష్ట్రం నాల్గవ పారిశ్రామిక విప్లవంలో ముందంజలో నిలుస్తుందని, భవిష్యత్ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే శక్తిగా మారనున్నదని పేర్కొన్నారు. పారిశ్రామిక విప్లవం, సాంకేతిక మార్పుల్లో తెలంగాణ చూపుతున్న నైపుణ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.

దావోస్ నుండి తెలంగాణ భవిష్యత్తు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతోంది. ఈ చారిత్రాత్మక సమావేశం తెలంగాణను ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ప్రధాన భాగస్వామిగా మార్చే దిశగా కీలకంగా మారనుంది. భారత ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ముఖ్య కేంద్రంగా అవతరించడానికి, అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రతిభను చాటిచెప్పేలా ఈ భేటీ కీలక పాత్ర పోషించనుంది. తెలంగాణను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడంలో మంత్రి శ్రీధర్ బాబు గారి దూరదృష్టి, నాయకత్వం ప్రత్యేకంగా ప్రశంసనీయం. ఈ సమావేశం ఆయన ప్రతిభను చాటిచెప్పే ఘట్టంగా నిలుస్తోంది. దావోస్‌లో జరిగిన ఈ చారిత్రాత్మక భేటీతో, ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణను ప్రభావశీల గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టేందుకు శ్రీధర్ బాబు గారి ప్రయాణం మరింత వేగవంతమైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో