AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్ టాక్సీ బుకింగ్ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం.. Ola-Uberలకు నోటీసులు జారీ!

ప్రముఖ కారు, బైక్ టెక్సీ సంస్థలు ఉబెర్, ఓలా, ర్యాపిడో వాటి ధరలకు సంబంధించి వినియోగదారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, ఈ విషయంలో కంపెనీలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనిపై ప్రజలు నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అయా కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఆన్‌లైన్ టాక్సీ బుకింగ్ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం.. Ola-Uberలకు నోటీసులు జారీ!
Uber Ola Taxi
Balaraju Goud
|

Updated on: Jan 23, 2025 | 5:15 PM

Share

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ప్రయాణికులను చేరవేస్తున్న ఉబెర్, ఓలా సంస్థలకు భారీ జరిమానా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈమేరకు నోటీసులు జారీ చేసింది. కారు టాక్సీ, బైక్-టాక్సీ కంపెనీలు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రయాణీకుల బుకింగ్ యాప్ లేదా వెబ్‌సైట్‌ నిర్వాహకులకు జరిమానా నోటీసు పంపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయా కంపెనీలు సరియైన సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

గత కొన్ని నెలలుగా, ప్రముఖ టెక్సీ సంస్థలు ఉబెర్, ఓలా, ర్యాపిడో వాటి ధరలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కంపెనీలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనిపై ప్రజలు నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు తమ సోషల్ మీడియాలో దీనికి ప్రత్యక్ష రుజువును కూడా అప్‌లోడ్ చేశారు. అటువంటి పరిస్థితిలో, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ అయా కంపెనీలకు నోటీసు పంపింది.

భారత వినియోగదారు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి తన సోషల్ మీడియా సైట్ X లో ఈ సమాచారాన్ని అందించారు. కేంద్ర మంత్రి తన పోస్ట్‌లో ఇలా వ్రాశారు, “వినియోగిస్తున్న వివిధ మోడళ్ల మొబైల్‌ల (ఐఫోన్, ఆండ్రాయిడ్) ఆధారంగా, విభిన్న ధరలను సెటప్ చేసిందని, మొబైల్ ఫోన్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నారని, CCPA ద్వారా వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు Olaకి ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. అటు Uberకి నోటీసు జారీ చేసాం. వారి సమాధానం కోరాం.” అని మంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఉబెర్, ఓలా ధరల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా, ఉబర్ వంటి రైడ్-హెయిలింగ్ యాప్‌లపై విభిన్న ధరలకు సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేశారు. అతను వివిధ పరికరాలు, బ్యాటరీ స్థాయిలలో ఛార్జీలను పోల్చారు. అయితే ఆ తర్వాత, ఉబెర్ ఆరోపణలను ఖండించింది. ఫోన్ రకం ఆధారంగా ఛార్జీలలో ఎలాంటి తేడా లేదని ఉబెర్ తెలిపింది.

అటువంటి పరిస్థితిలో, తాజాగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ తీవ్రమైన ఆరోపణలు ఈ కంపెనీలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..