Business Ideas: చిన్న వ్యాపారం.. ఎక్కువ లాభాలు.. సోదరుల బిజినెస్‌ ఐడియా అదిరింది.. కరోనా కాలంలోనూ మంచి లాభాలు

Business Ideas: ఆదాయం పెంచుకునేందుకు మనం రకరకాల బిజినెస్‌లను చేస్తుంటాము. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి పెద్ద వ్యాపారం ప్రారంభించే విధంగా ఎ..

Business Ideas: చిన్న వ్యాపారం.. ఎక్కువ లాభాలు.. సోదరుల బిజినెస్‌ ఐడియా అదిరింది.. కరోనా కాలంలోనూ మంచి లాభాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 08, 2021 | 3:44 PM

Business Ideas: ఆదాయం పెంచుకునేందుకు మనం రకరకాల బిజినెస్‌లను చేస్తుంటాము. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి పెద్ద వ్యాపారం ప్రారంభించే విధంగా ఎదిగిపోతారు. ఇప్పటికే దేశంలో ఎన్నో షాపింగ్ మాళ్లు, సూపర్ మార్కెట్లు, షాపులు ఉన్నా… అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఎలా డెవలప్ అవుతున్నాయి. ఇదే విధంగా ఇద్దరు సోదరులకు వచ్చిన ఐడియాతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెస్‌ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రేదశ్‌లోని మీరట్‌లో యూనివర్సిటీ రోడ్డు పక్కన ఓ కొబ్బరి బోండాల బండి ఉంటుంది. దీనిని ఇద్దరు సోదరులు ప్రారంభించారు. కరోనా సెకండ్‌వేవ్‌ రాక ముందు వరకూ వీరు మిగతా వ్యాపారుల లాగే కొబ్బరి బోండాలు అమ్ముతూ ఉండేవారు. ఇక కరోనా సెకండ్ వేవ్ వచ్చాక… వీరికి ఓ ఐడియా వచ్చింది. కొబ్బరి నీళ్లను ఇళ్లకే సరఫరా చేస్తే ఎలా ఉంటుంది అని. అంతే.. షాపు ముందు ఓ భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు. 10 కంటే ఎక్కువ బోండాలు ఆర్డర్ ఇస్తే.. ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తామంటూ… మొబైల్ నంబర్ ఇచ్చారు. అంతే… చాలా మంది వీరికి ఫోన్ చేసి… కొబ్బరి నీళ్లను డోర్ డెలివరీ చేయించుకుంటున్నారు.

తమ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి ఈ సోదరులు మరో టెక్నిక్ అమలు చేశారు. సోషల్ మీడియాలో అంటే.. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, కూ వంటి సైట్లలో.. తమ డోర్ డెలివరీపై మెసేజ్ పెడుతూ.. మొబైల్ నంబర్ ఇచ్చారు. దాంతో.. చాలా మంది స్థానికులు వీళ్లకు కాల్ చేసి… తమకు కోకోనట్ వాటర్ కావాలని కోరుతున్నారు. వీళ్లు లీటర్ బాటిళ్లలో కొబ్బరి నీళ్లను నింపి.. డోర్ డెలివరీ చేస్తున్నారు. క్వాలిటీలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నిజాయితీగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో ఈ సోదరుల బిజినెస్ దూసుకుపోతోంది.

ప్రస్తుతం రోజూ వెయ్యి రూపాయల ఆదాయం

ప్రస్తుతం ఈ సోదరులు రోజూ వేల రూపాయలు ఆదాయం పొందుతున్నారు. ఖర్చులు పోగా.. మంచి లాభాలు మిగులుతున్నాయని వీరిద్దరు చెబుతున్నారు. కష్టపడుతున్నాం కాబట్టి… ఫలితం వస్తోందని అంటున్నారు. కరోనా కాలంలో.. వ్యాపారం నష్టపోకుండా మరింత పెంచుకునేందుకు వీరు వేసిన ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. త్వరలో రకరకాల పండ్లను కూడా డోర్ డెలివరీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ సోదరులు తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

BSE Users: కరోనా సమయంలోనూ భారీగా పెరిగి ఏడు కోట్లకు చేరిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ యూజర్లు

PM Kisan: రైతులకు శుభవార్త.. ఈ సంవత్సరం మీ బ్యాంక్ ఖాతాల్లోకి రూ.36,000.. ఎలాగంటే..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?