AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. ఈ సంవత్సరం మీ బ్యాంక్ ఖాతాల్లోకి రూ.36,000.. ఎలాగంటే..

దేశంలోని రైతులందరికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు స్కీమ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో

PM Kisan: రైతులకు శుభవార్త.. ఈ సంవత్సరం మీ బ్యాంక్ ఖాతాల్లోకి రూ.36,000.. ఎలాగంటే..
Pm Kisan
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2021 | 12:44 PM

Share

దేశంలోని రైతులందరికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు స్కీమ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కూడా ఒకటి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.6 వేలు జమ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ డబ్బులను అందించనుంది. కానీ ఇవి ఒకేసారి కాకుండా.. విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమవుతాయి. ప్రతి విడతలో రూ.2 వేలు చొప్పున వస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం 8 విడతలలో డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమచేసింది.

అలాగే పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం మాదిరిగానే కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటుంది. ఈ పథకం ద్వారా రైతులు ప్రతి నెల రూ. 3 వేలు లభిస్తాయి. అంటే 12 నెలలకు కలిపితే.. సంవత్సరానికి రూ. 36 వేలు వస్తాయి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద నమోదు చేసుకున్న ఏ రైతు అయినా కిసాన్ మన్ ధన్ యోజన నుండి లబ్ది పొందవచ్చు. ఈ పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద నమోదు చేసుకున్న 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలవారీ పెన్షన్ రూపంలో ఆర్థిక భరోసా అందిస్తుంది.

పీఎం కిసాన్ మన్ ధన్ పథకంలో ఎలా చేరాలంటే.. * పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ లో నమోదు చేసుకున్న రైతులు కిసాన్ మన్ ధన్ యోజన పథకంలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇందు కోసం రైతులకు రెండు హెక్టార్లలోపు సాగు భూమి ఉండాలి. పిఎం కిసాన్ మన్ ధన్ యోజన కింద దరఖాస్తు చేసుకోవడానికి రైతు ఇంకా ఎటువంటి సర్టిఫికేట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. ముందుగా రైతు ఈ పథకంలో 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇందులో 18 సంవత్సరాల వయసున్న వారు కూడా చేరవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి నెలా రూ. 55 కట్టాలి. అలాగే 0 ఏళ్ల వయసులో చేరితే రూ.110 చెల్లించాలి. 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.200 కట్టాలి. 60 ఏళ్ల తర్వాతి నుంచి మీకు నెలకు రూ.3 వేలు వస్తాయి.

Also Read: Lisa Banes: ‘గాన్ గర్ల్’ మూవీ నటికి రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయలతో ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమం..

AR Rahmans: వ్యాక్సిన్ వేయించుకున్న ఏఆర్ రెహమాన్.. కానీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న అతని మాస్క్.. ఇంతకీ స్పెషల్ ఏంటో తెలుసా..