Home Loan Interest Rates: హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే ఇప్పుడే తీసుకోండి.. ఎందుకంటే..
Home Loan Interest Rates: సొంతిళ్లు అనేది ప్రతీ ఒక్కరి కల. వారి వారి ఆర్థికి పరిస్థితుల ఆధారంగా చిన్నదో.. పెద్దదో ఓ సొంతింటి కలిగి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే...
Home Loan Interest Rates: సొంతిళ్లు అనేది ప్రతీ ఒక్కరి కల. వారి వారి ఆర్థికి పరిస్థితుల ఆధారంగా చిన్నదో.. పెద్దదో ఓ సొంతింటి కలిగి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న కొంత మొత్తంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తమ కలను సాకారం చేసుకుంటారు. ఇందులో భాగంగా తక్కువ వడ్డీకి రుణం వచ్చే హోమ్ లోన్‌పైనే ఎక్కువ మంది ఆధారపడుతుంటారు. అయితే హోమ్ లోన్ కోసం ప్రయత్నించే వారికి ఇదే అనువైన సమయమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. కరోనా నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిండం, ప్రాసెసింగ్ ఫీజును కూడా గతంతో పోలిస్తే తగ్గించడంతో లోన్‌లు తీసుకోవడానికి ఇది మంచి తరుణమని చెబుతున్నారు. మరి మారిన వడ్డీ రేట్ల ఆధారంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఏ బ్యాంకు ఎంత వడ్డీకి రుణాలు ఇస్తుందన్న దానిపై ఓ లుక్కేయండి..
కొటాక్ మహీంద్రా – 6.65% పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు – 6.65% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.70% హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – 6.75% ఐసీఐసీఐ బ్యాంకు – 6.75% బ్యాంక్ ఆఫ్ బరోడా – 6.75% యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.80% పంజాబ్ నేషనల్ బ్యాంకు – 6.80% సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.85% ఐడీబీఐ బ్యాంక్ – 6.85% యాక్సిక్ బ్యాంక్ – 6.90% కెనెరా బ్యాంక్ – 6.90% ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ – 6.90% యూసీఓ బ్యాంక్ – 6.90% బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.95% ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ – 7.05% పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్ – 7.35% కర్ణాటక బ్యాంక్ – 7.50% ఫెడరల్ బ్యాంక్ – 7.65% స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్ – 7.99% యస్ బ్యాంక్ – 8.95%
Also Read: FINANCIAL PACKAGE: ఉద్దీపన ప్యాకేజీపై కేంద్రం కసరత్తు.. న్యూఢిల్లీలో భేటీ కానున్న కేబినెట్ కమిటీ
AP Vaccination: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు త్వరగా వ్యాక్సినేషన్