Silver Price Today: బంగారం బాటలోనే.. పరుగులు పెడుతున్న వెండి ధర.. తాజా రేట్ల వివరాలు
Silver Price Today: దసరా, దీపావళి, ధంతేరస్ ఇలా పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు..
Silver Price Today: దసరా, దీపావళి, ధంతేరస్ ఇలా పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా జరుగుతుంటాయి. బంగారం లాగా విక్రయాలు జరగకపోయినా.. ఎంతో కొంత వెండి విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా బంగారం ధర భారీగానే పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో వెండిపై దాదాపు రూ.2వేలకుపైగా పెరిగితే.. ఈ రోజు రూ.1200 వరకు ఎగబాకింది. తాజాగా శనివారం దేశీయంగా ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.59,500 ఉండగా, చెన్నైలో రూ.63,700 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.59,500 ఉండగా, కోల్‌కతాలో రూ.59,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.59,500 ఉండగా, కేరళలో రూ.63,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,700 ఉండగా, విజయవాడలో రూ. 63,700 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా ఉన్న వెండి ధరలు ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.