Silver Price Today: దేశీయంగా మళ్లీ పెరిగిన వెండి ధర.. అక్కడ మాత్రం రూ. 4 వేల వరకు తగ్గింది.. ఎక్కడంటే..!
Silver Price Today: భారతీయులు బంగారం, వెండికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. రోజువారీగా వెండి కొనుగోళ్ల సాధారణంగా జరిగినా.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు సిల్వర్.
Silver Price Today: భారతీయులు బంగారం, వెండికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. రోజువారీగా వెండి కొనుగోళ్ల సాధారణంగా జరిగినా.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు సిల్వర్ కొనుగోలు భారీగా జరుగుతుంటాయి. అయితే దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక తాజాగా శుక్రవారం బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండి ధరపై స్వల్పంగా పెరిగింది. అయితే రూ.200 నుంచి రూ.250 వరకు పెరిగింది. బంగారం లాగానే దేశంలో వెండి ధర కూడా ఒక్కో నగరంలో ఒక్కోలా పెరిగింది. అయితే బెంగళూరులో మాత్రం రూ.4 వేల వరకు తగ్గింది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,900 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.69,900 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, కోల్‌కతాలో రూ.69,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కేరళలో రూ.69,900 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74.200 ఉండగా, విజయవాడలో కిలో వెండి రూ.74,200 ఉంది. అయితే అన్ని నగరాల్లో దాదాపు స్వల్పంగా పెరిగినా.. బెంగళూరులో మాత్రం నిన్నటి కంటే ఈ రోజు కిలో వెండి ధరపై 4 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.