Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!

Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్‌, సిల్వర్‌ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. ధరలు పెరిగినా..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!
Silver Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Nov 23, 2021 | 6:19 AM

Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్‌, సిల్వర్‌ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏ మాత్రం ఆగవు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలను అధికంగా కొనుగోలు చేస్తుంటారు మహిళలు. ఇక తాజాగా మంగళవారం (నవంబర్‌ 23)న బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 65,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై లో65,600 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.70,400 ఉండగా, కోల్‌కతాలో రూ.65,600 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,400 ఉండగా, విజయవాడలో రూ.70,400 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.70,400 ఉండగా, మధురైలో రూ.70,400 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. ఇక బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత ఉందంటే..

Aadhaar Card Holders: ఆధార్‌ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 166 ఆధార్‌ సేవా కేంద్రాలు..!

Term Life Insurance: మీరు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కొనుగోలు చేస్తున్నారా..? ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!