Two Wheelers: ఈ ఏడాది బైక్‌ల విక్రయాలకు పెద్ద ఎదురుదెబ్బ.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Two Wheelers: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు చాలా పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన 1-4 శాతం తగ్గవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది.

Two Wheelers: ఈ ఏడాది బైక్‌ల విక్రయాలకు పెద్ద ఎదురుదెబ్బ.. కారణాలు ఇలా ఉన్నాయి..?
Two Wheelers
Follow us
uppula Raju

|

Updated on: Nov 22, 2021 | 10:53 PM

Two Wheelers: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు చాలా పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన 1-4 శాతం తగ్గవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. ద్విచక్ర వాహనాల ధరలు నిరంతరం పెరగడం, పెట్రోలు ఖరీదైనవి కావడంతో బైక్‌ల కొనుగోలు తగ్గిందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. కరోనా వల్ల పేలవమైన పనితీరు, తక్కువ ఆదాయం వల్ల ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో కూడా కంపెనీలకు నిరాశే ఎదరైందని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో దేశీయ ద్విచక్ర వాహన విక్రయాలు 80.5 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది కూడా ఇంతే. రుణ చెల్లింపులో డిఫాల్ట్ అయినందున ఫైనాన్షియర్లు జాగ్రత్తగా ఉంటారని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

1. ప్రీమియం సెగ్మెంట్ బైక్‌లపై తక్కువ ప్రభావం ద్విచక్ర వాహనాల్లో ప్రీమియం బైక్‌ల డిమాండ్ మెరుగ్గా ఉంది. ద్విచక్ర వాహన మార్కెట్లో దీని మార్కెట్ వాటా దాదాపు 15 శాతానికి చేరువలో ఉంది.

2. ఎంట్రీ లెవల్ బైక్‌లలో అత్యధిక మార్కెట్ వాటా ఎంట్రీ సెగ్మెంట్ బైక్ (75-110cc) భారతదేశంలోని ద్విచక్ర వాహన మార్కెట్‌కు అతిపెద్ద సహకారాన్ని అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌పై కూడా సెకండ్‌ వేవ్‌ కరోనా ప్రభావం చూపింది. ఉద్యోగం కోల్పోవడం, ఆదాయం కోల్పోవడం, జీతంలో కోత, పెంపుదల లేకపోవడం, వైద్య ఖర్చులు పెరగడం, బైక్‌ల ధరల పెరుగుదల కారణంగా దీని అమ్మకాలు బాగా దెబ్బతిన్నాయి.

3. పండుగ సీజన్‌లో విక్రయాలు18 శాతం క్షీణించాయి ఆటోమొబైల్ రంగం అమ్మకాల పరంగా ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో అత్యంత దారుణంగా ఉంది. వాహన డీలర్ల సంస్థ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఎడిఎ) ఈ విషయాన్ని చెబుతోంది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 42 రోజుల పండుగ కాలంలో అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. కార్ల కొరత, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గడం దీనికి కారణాలు. 42 రోజుల వ్యవధిలో విక్రయాలు18 శాతం క్షీణించాయి. 2019తో పోలిస్తే 21 శాతం క్షీణత నమోదైంది.

Weight Loss: 60 ఏళ్లు దాటినవారు బరువు తగ్గాలంటే ఈ వ్యాయామాలు చక్కటి పరిష్కారం..

EPFO గుడ్‌ న్యూస్‌..18.34 కోట్ల ఖాతాదారులకు 8.50 శాతం వడ్డీ చొప్పున వడ్డీ జమ.. ఇలా చెక్ చేసుకోండి..

Health News: రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా..! చాలా హానికరం..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు