Shoppers Stop: మహిళా ఉద్యోగులకు శుభవార్త తెలిపిన షాపర్‌ స్టాప్‌.. ఆ రోజుల్లో పెయిడ్‌ లీవ్స్‌..

Shoppers Stop: భారత్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌, బ్యూటీ ప్రొడక్ట్స్‌ స్టోర్‌ అయిన షాపర్‌ స్టాప్‌ తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. నెలసరి వంటి వ్యక్తిగత సమస్యతో ఇబ్బంది పడే మహిళల కోసం ప్రత్యేకంగా సెలవులు ప్రకటించింది. సాధారణంగా...

Shoppers Stop: మహిళా ఉద్యోగులకు శుభవార్త తెలిపిన షాపర్‌ స్టాప్‌.. ఆ రోజుల్లో పెయిడ్‌ లీవ్స్‌..
Shoppers Stop
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 10, 2022 | 7:41 PM

Shoppers Stop: భారత్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌, బ్యూటీ ప్రొడక్ట్స్‌ స్టోర్‌ అయిన షాపర్‌ స్టాప్‌ తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. నెలసరి వంటి వ్యక్తిగత సమస్యతో ఇబ్బంది పడే మహిళల కోసం ప్రత్యేకంగా సెలవులు ప్రకటించింది. సాధారణంగా నెలసరి సమయాల్లో మహిళలు చాలా ఇబ్బందికి గురవుతుంటారు. ఆ రోజుల్లో సెలవు అడగాలంటే కారణం ఏం చెప్పాలో.. చెబితే ఏం అనుకుంటారో అన్న అనుమానం మహిళల్లో కలగడం సర్వసాధారణం. మహిళలకు ఎదురయ్యే ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న షాపర్‌ స్టార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏడాదిలో 12 పెయిడ్ లీవ్స్‌ను అందిస్తూ షాపర్‌ స్టాప్‌ ప్రకటన జారీ చేసింది. సిక్‌ లీవ్స్‌తో పాటు ఇతర సెలవులతో సంబంధం లేకుండా ఈ 12 సెలవులను అదనంగా అందిస్తారు.

ఈ విషయమై షాపర్‌ స్టాప్‌ కస్టమర్‌ కేర్‌ అసోసియేట్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ వెనుగోపాల్‌ నాయర్‌ మాట్లాడుతూ.. ‘మా కస్టమర్‌ కేర్‌ అసోసియేట్స్‌ గంటల తరబడి పనిచేస్తూ వినియోగదారులకు సేవలు అందిస్తుంటారు. ఇలా దీర్ఘ కాలంపాటు మహిళలు పనిచేయడం వల్ల సహజంగానే అలసట వస్తుంది. మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే ఈ అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం.

నెలసరి సమయంలో మహిళలు ఈ సెలవులను స్వచ్ఛందంగా తీసుకోవచ్చు. మహిళా ఉద్యోగుల కోసం అనూకూలమైన వాతావరణాన్ని కలిపించే దిశగా అడుగులు వేస్తున్నాం. షాపర్‌ స్టాప్‌ తమ ఉద్యోగులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ సెలవులను ఉపయోగించుకోవడం ప్రతీ మహిళా హక్కు’ అని చెప్పుకొచ్చారు.

Also Read: నీళ్లు తాగ‌డం మ‌ర‌వొద్దు..

Viral Video: పెద్ద పులి, ఎలుగుబంటి ముఖాముఖి.. జంగిల్ బుక్‌లో దృశ్యం అంటూ నెట్టింట్లో వీడియో వైరల్

Redmi Note 11 నిజంగా 15 నిమిషాల్లోపు రోజంతా సరిపడే ఛార్జింగ్ అందించగలదా? మేము కనుగున్నాం.. మీరు నిశ్చింతగా ఉండండి..