Redmi Note 11 నిజంగా 15 నిమిషాల్లోపు రోజంతా సరిపడే ఛార్జింగ్ అందించగలదా? మేము కనుగున్నాం.. మీరు నిశ్చింతగా ఉండండి..
ఫాస్ట్ ఛార్జింగ్ అందించటంలో టెక్ దిగ్గజం Xiaomi ఫ్లాగ్ బేరర్‌గా ఉంది. చాలా కాలం క్రితం Xiaomi 11iతో మార్కెట్లోకి దూసుకొచ్చిన కంపెనీ..
ఫాస్ట్ ఛార్జింగ్ అందించటంలో టెక్ దిగ్గజం Xiaomi ఫ్లాగ్ బేరర్‌గా ఉంది. చాలా కాలం క్రితం Xiaomi 11iతో మార్కెట్లోకి దూసుకొచ్చిన కంపెనీ.. తాజాగా Redmi Note 11 Pro సిరీస్‌తో తన పవర్ ఛార్జింగ్ లెగసీని ముందుకు కొనసాగించటమే లక్ష్యంగా స్మార్ట్ ఫోన్ ప్రియులకోసం ఇప్పుడు వచ్చేస్తోంది. ఉత్తమమైన వాటిని మరింత మెరుగ్గా చేస్తానని వాగ్దానంలో భాగంగా Redmi సంస్థ తన #RedmiNote11 Pro సిరీస్‌ని తీసుకొచ్చింది.
అత్యుత్తమ ఫీచర్లను వినియోగదారులకు నిజాయితీ ధరలకు అందించటంలో రెడ్‌మి పేరుగాంచింది. ఈ సారి కంపెనీ తన తాజా ఆఫర్‌లో 67W టర్బో ఛార్జ్‌ని పరిచయం చేసింది. ఇది ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీగా నిలిచింది. Redmi Note 11 Pro సిరీస్ అద్భుతమైన AMOLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది స్పష్టమైన రంగులను నిర్ధారిస్తుంది. పరిశ్రమ ప్రమాణాల ప్రకారం అత్యధిక రిజల్యూషన్ ఇమేజ్ సెన్సార్ అయిన 108MP ప్రధాన కెమెరా ఈ సిరీస్ లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్ మాత్రమే కాదు.. ఈ ధర పరిధిలో ఇతర కంపెనీల మోడళ్లలో కనుగొనటం అసాధ్యమని కంపెనీ చెబుతోంది.
120Hz రిఫ్రెష్ రేట్‌తో, ఇన్‌పుట్ లాగ్ లేదా యానిమేషన్ లాగ్ లేకుండా డిస్‌ప్లే స్మూత్‌గా, సూపర్ ఫాస్ట్‌గా ఉండనుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు రీడింగ్ మోడ్ 3.0 సూర్యకాంతిలో ఉన్న పరిస్థితుల్లో కూడా సులభంగా చదవగలిగేందుకు అనువుగా ఉంటుంది. అటువంటి అధునాతన ఫీచర్లతో పాటుగా Redmi Note 11 Pro సిరీస్.. 15 నిమిషాల్లో ఒక రోజు మెుత్తానికి సరిపడేంద ఛార్జింగ్ అందించనుంది. ఇది నిజంగా ఫోన్‌ను పూర్తి ప్యాకేజీగా మార్చటంతో పాటు స్మార్ట్ ఫోన్ ప్రియులు కొనుగోలుకు అత్యుత్తమమైన ఎంపికగా ఫోన్ నిలుస్తోంది.
వినియోగదారుల అంచనాలను ఎలా అందుకోవాలో పోటీ దారులకు Redmi పాఠాన్ని అందిస్తోంది. దీనికి తోడు మరికొన్ని జాగ్రత్తలనూ సూచిస్తుంది. #RedmiNote11Pro సిరీస్ స్మార్ట్ ఫోన్లలో మీరు ఇప్పుడు మీ ఫోన్‌ను కేవలం 15 నిమిషాల్లో పూర్తి రోజు వినియోగానికి అవసరమైన ఛార్జింగ్ చేసుకోవచ్చు. భారతదేశంలో అత్యంత ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సిరీస్‌గా మార్కెట్లో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చెందిన రెడ్‌మి నోట్ సిరీస్ వారసత్వాన్ని.. ఇప్పుడు RedmiNote11Pro కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.