Spain rules: సెల్ ఫోన్ల వినియోగంపై షాకింగ్ నిర్ణయం.. ఆ దేశంలో పక్కా నిబంధనల అమలుకు చర్యలు

ఆధునిక కాలంలో మనిషికి అత్యంత అవసరమైన పరికరం స్మార్ట్‌ ఫోన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి చేతుల్లోనూ ఇది కనిపిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ లేకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ అడుగడుగునా దీని అవసరం ఉంటోంది. ఇంతలా మనకు ఉపయోగపడుతున్న స్మార్ట్‌ ఫోన్‌.. మన ఆరోగ్యాన్ని కూడా హరించివేస్తోంది.

Spain rules: సెల్ ఫోన్ల వినియోగంపై షాకింగ్ నిర్ణయం.. ఆ దేశంలో పక్కా నిబంధనల అమలుకు చర్యలు
Smartphone Use For Hours
Follow us
Srinu

|

Updated on: Dec 08, 2024 | 7:00 AM

మద్యం, సిగరెట్‌ మాదిరిగా చాలామందికి స్మార్ట్ ఫోన్ కూడా వ్యసనంగా మారింది. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఈ విషయాన్నిప్రపంచంలో పలు దేశాలు గుర్తించాయి. స్పెయిన్‌ అయితే మరో ముందడుగు వేసి సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది. యువత ఆరోగ్యంపై స్మార్ట్‌ ఫోన్‌ అనేక దుష్ప్రభావాలు చూపుతోంది. గంటల కొద్దీ చూడడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు రాత్రి సమయంలో నిద్ర కూడా మానుకుని స్మార్ట్‌ ఫోన్‌ లోనే గడుపుతున్నారు. ఈ వ్యసనాన్ని పబ్లిక్‌ హెల్త్‌ ఎపిడెమిక్‌ అని పిలుస్తూ.. స్పెయిన్‌ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

సిగరెట్‌ ప్యాకెట్లపై కనిపించే మాదిరిగానే ఆ దేశంలో విక్రయించే స్మార్ట్‌ ఫోన్లపై ఆరోగ్య హెచ్చరికలు అవసరమని గుర్తించింది. అధికంగా ఫోన్‌ చూడడం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడం దీని ప్రధాన ఉద్దేశం. మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇదే తరహ హెచ్చరిక స్మార్ట్‌ ఫోన్లపై కూడా కనిపించేలా చర్యలు తీసుకోనుంది. సెల్‌ ఫోన్ల వల్ల కలిగే అనర్థాలను నియంత్రించడానికి ఓ నిపుణుల కమిటీని గతంలోనే స్పెయిన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలోని సభ్యులు అనేక అంశాలను పరిశీలించి 250 పేజీల నివేదికను అందించారు. దానిలోని సూచనల ప్రకారం.. ప్యానెల్‌ డిజిటల్‌ సేవలపై తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరికలు ఉంటాయి.

ఎ‍క్కువ సమయం సెల్‌ ఫోన్‌ ను వినియోగిస్తుంటే హెచ్చరికలు అందుతాయి. దాని వల్ల జరిగే నష్టాల గురించి రిమైండర్‌ను అందజేస్తాయి. నిర్థిష్ట యాప్‌లు, ప్లాట్‌ఫారాలను యా​క్సెస్‌ చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై హెచ్చరిక సందేహాలు కనిపిస్తాయి. మూడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు డిజిటల్‌ పరికరాలను వాడకూడదు. మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిమితంగా అవకాశం ఉంటుంది. 16 ఏళ్ల లోపు వారికోసం పరిమిత కార్యాచరణతో డంబ్‌ ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి. అలాగే 12 ఏళ్లలోపు పిల్లలు సోషల​ మీడియాకు దూరంగా ఉండాలి. చదువుకు సంబంధించి కొన్ని రకాల ఫీచర్లతో కూడిన యాప్‌ల వినియోగాన్ని కమిటీ తప్పుపట్టింది. దాని వల్ల పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది. వాటిని తొలగించి, విద్యార్థుల కోసం అనలాగ్‌ బోధనా పద్ధతులను అనుసరించాలని కోరింది. సోషల్‌ మీడియాలోని వివిధ ప్లాట్‌ పాంలను 16 ఏళ్ల లోపు పిల్లలు యాక్సెస్‌ చేయడానికి కఠిన మైన వయసు నిబంధనలు అమలు చేయాలి. కాగా.. ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి