Union Mutual Fund: సరికొత్త మ్యూచువల్‌ ఫండ్‌.. ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంటే..!

Union Mutual Fund: ఇది ఒక ఈక్విటి ఫండ్‌ లాంటిది. ఇందులో కొన్ని ఫండ్స్‌ సమ్మేళాలను కలిగి ఉంటుంది. అందులో ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు. యాక్టివ్‌ మమూమెంట్‌ ఫండ్‌ ప్రణాళిక..

Union Mutual Fund: సరికొత్త మ్యూచువల్‌ ఫండ్‌.. ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 07, 2024 | 7:31 PM

యూనియన్ మ్యూచువల్ ఫండ్ తన కొత్త ఫండ్ ఆఫర్ – యూనియన్ యాక్టివ్ మొమెంటం ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఊపందుకుంటున్న స్టాక్‌లలో పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించి, ఫ్యాక్టర్-బేస్డ్ ఇన్వెస్టింగ్‌లోకి ప్రవేశించడాన్ని ఇది సూచిస్తుంది. మొమెంటం ఫండ్ NFO నవంబర్ 28, 2024 నుండి సభ్యత్వాల కోసం ఓపెన్‌ చేయగా, ఇప్పుడు ముగియనున్నట్లు ప్రకటించింది. ఫండ్ NFO (న్యూ ఫండ్ ఆఫర్ ) నవంబర్ 28న సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ప్రారంభించగా, డిసెంబర్ 12, 2024న క్లోజ్‌ కానుంది. అయితే సబ్‌స్క్రిప్షన్‌లు కేటాయింపు నుండి 5 పని దినాలలోపు తిరిగి తెరవనున్నారు. యూనియన్ యాక్టివ్ మొమెంటమ్ ఫండ్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్. మొమెంటం థీమ్‌ను అనుసరించే స్కీమ్‌. ఇది మొమెంటం చూపించే స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంది. యూనియన్ యాక్టివ్ మొమెంటం ఫండ్, యాజమాన్య పరిమాణాత్మక నమూనాను అనుసరిస్తుంది.

ఈ ఫండ్ పెట్టుబడిదారులకు స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి నియమ నిబంధనలతో అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొమెంటంకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. అయితే ఈ పెట్టుబడులు పూర్తిగా నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం, పెట్టుబడిదారులకు లాభాలు అందించడం, వారి సమస్యలను సులభతరం చేస్తుంది. అంతేకాదు పెట్టుబడులపై నిరంతరం పర్యవేక్షిస్తుందని కో-ఫండ్ మేనేజర్ గౌరవ్ చోప్రా తెలిపారు.

ఇది ఒక ఈక్విటి ఫండ్‌ లాంటిది. ఇందులో కొన్ని ఫండ్స్‌ సమ్మేళాలను కలిగి ఉంటుంది. అందులో ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు. యాక్టివ్‌ మమూమెంట్‌ ఫండ్‌ ప్రణాళిక 15 ఏళ్లుగా పలు రకాల ఫండ్స్‌ ఫాలో అవుతూ యూనియన్‌ యాక్ట్‌వ్‌ ఫండ్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ధర పెరుగుదల, స్థిరమైన లాభాలు, ఈక్విటి మొదలైన వాటితో ట్రస్ట్‌ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ఈ ట్రస్ట్‌పై పెట్టుబడిదారుల నమ్మకాన్ని చేకూరుస్తోంది. ఈ ఫండ్‌ పెట్టుబడిదారులకు సరైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి మంచి వ్యూహాలను అందిస్తుంది. అలాగే ఈ ఫండ్‌లో పెట్టుబడులపై పూర్తిగా నియమ నిబంధనలతో ఉంటాయి.

సంజయ్ బెంబాల్కర్, హెడ్ ఈక్విటీ జోడించారు, “మొమెంటం పెట్టుబడిదారులు ఎలా వ్యవహరిస్తారు అనే దాని గురించి ఈక్విటీ హెడ్‌ సంజయ్‌ బెంబాల్కర్‌ మాట్లాడారు. ఇన్వెస్టర్లకు సరైన సమాచారం అందించడం, స్టాక్ ధరలను పెంచడం, పెట్టుబడిదారులు లాభాలు అర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Disclaimer: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. అన్ని స్కీమ్ సంబంధిత వివరాలు పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్‌ చేయడం మంచిది.

ఇది కూడా చదవండి: Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి