Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే ఎప్పటికీ నష్టం రాదు..!

2016 సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్లు 33 శాతంగా ఉండగా, ఇది 2021లో 45 శాతానికి పైగా పెరిగింది. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.

షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే ఎప్పటికీ నష్టం రాదు..!
Stock Market Investment
Follow us
Venkata Chari

|

Updated on: Nov 07, 2021 | 8:51 PM

Share Market: కరోనా కాలంలో స్టాక్ మార్కెట్ ఏప్రిల్ 2020లో క్రాష్ అయ్యింది. ఆ తర్వాత బుల్ రన్ ప్రారంభమైంది. గత ఏడాదిన్నర కాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం బాగా పెరిగింది. చిన్న పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడి పెట్టి ఉండొచ్చేమో.. కానీ, వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 14.2 మిలియన్లు పెరిగింది. ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం రిటైల్ పెట్టుబడిదారులు 2016 సంవత్సరంలో 33 శాతంగా ఉంటే, 2021 నాటికి 45 శాతానికి పెరిగింది. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్‌ 2020, 2021లో మార్కెట్ ఇచ్చిన రిటర్న్‌లు 2022లో ఇవ్వలేవని గుర్తుంచుకోవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

లాభాలను ఆర్జించే కంపెనీల్లో పెట్టుబడి.. ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ లాభాలు ఆర్జిస్తుందా లేదా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒక కంపెనీ లాభాలను ఆర్జిస్తున్నట్లయితే, అది ఖచ్చితంగా దాని పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తుంది. ఇది కాకుండా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటే మాత్రం చాలా కాలం పాటు పెట్టుబడి పెట్టాలి.

లీడర్ స్టాక్‌ను ఎంచుకోవాలి.. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే అధిక విలువ గల స్టాక్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒక స్టాక్ ధర-ఆదాయాల నిష్పత్తి ఎక్కువగా ఉంటే, దాని నుంచి ఎక్కువ రాబడులను ఆశించడం తగదు. అయితే ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్తులో రాణించే రంగాలను ఎంచుకోవాలి. ఆ తర్వాత వాటిలో లీడర్ కంపెనీలను ఎంచుకోవాలి. ఒక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే లీడర్ కంపెనీలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది మెటల్, ఐటీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు మంచి పనితీరు కనబరిచాయి. 2020కి ముందు ఈ రంగాలపై పెట్టుబడిదారుల ఆసక్తి తక్కువగా ఉండేది.

పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేయడం మంచిది.. మూడవ ముఖ్యమైన విషయం తెలుసుకునే ముందు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున నోట్లను ముద్రించినప్పటి నుంచి బుల్ మార్కెట్ ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ఇంట్లో కూర్చున్న ప్రజల కళ్లు స్టాక్ మార్కెట్ వైపు మరలాయి. ప్రస్తుతం ఈ బుల్ రన్ మరో 2-3 ఏళ్ల పాటు కొనసాగుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, వివిధ రంగాల్లో పరుగులు కూడా కనిపిస్తాయి. కాబట్టి మీ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండడం చాలా ముఖ్యం.

Also Read: Facebook: ఫేస్‌బుక్‎ను వెంటాడుతున్న వివాదాలు.. తమ కంపెనీ పేరు కాపీ కొట్టారని కోర్టుకు వెళ్లిన మెటా..

త్వరలో 2000 మందికి ఉద్యోగాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ..

Yes Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన యస్ బ్యాంక్.. పూర్తి వివరాలు..

రూ. 200కే బట్టతల మందు.. జెట్‌స్పీడ్‌గా జుట్టు తెప్పిస్తాడట..
రూ. 200కే బట్టతల మందు.. జెట్‌స్పీడ్‌గా జుట్టు తెప్పిస్తాడట..
ఈ చిత్రంలో మెదట చూసిన ఫేస్ మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది
ఈ చిత్రంలో మెదట చూసిన ఫేస్ మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది
మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. పెట్టుబడికి మూడు రోజులే గడువు
ఎఫ్‌డీ ఖాతాదారులకు అలెర్ట్.. పెట్టుబడికి మూడు రోజులే గడువు
ప్రైవేటు బ్యాంకులోనూ పీఎం విద్యాలక్ష్మీ లోన్.. ఇలా అప్లై చేయండి
ప్రైవేటు బ్యాంకులోనూ పీఎం విద్యాలక్ష్మీ లోన్.. ఇలా అప్లై చేయండి
అది ప్రపంచంలోనే బెస్ట్‌ పిచ్‌ అయితే.. ఇది వరల్డ్‌లోనే..!
అది ప్రపంచంలోనే బెస్ట్‌ పిచ్‌ అయితే.. ఇది వరల్డ్‌లోనే..!
అప్పట్లో అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకుంది.. కట్ చేస్తే
అప్పట్లో అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకుంది.. కట్ చేస్తే
మీన రాశి ఉగాది ఫలితాలు.. కుటుంబపరంగా ఎలా ఉందంటే..?
మీన రాశి ఉగాది ఫలితాలు.. కుటుంబపరంగా ఎలా ఉందంటే..?
చీప్‌గా చూడొద్దు.. ఆ లోపంతో బాధపడేవారికి అమృతం లాంటిది.. ఉదయాన్నే
చీప్‌గా చూడొద్దు.. ఆ లోపంతో బాధపడేవారికి అమృతం లాంటిది.. ఉదయాన్నే
రోడ్లపై నమాజ్‌ చేస్తే.. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు!
రోడ్లపై నమాజ్‌ చేస్తే.. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు!