Facebook: ఫేస్‌బుక్‌ను వెంటాడుతున్న వివాదాలు.. తమ కంపెనీ పేరు కాపీ కొట్టారని కోర్టుకు వెళ్లిన మెటా..
ఫేస్‌బుక్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా అమెరికాలోని చికాగోకు చెందిన మెటా అనే టెక్ సంస్థ ఫేస్‌బుక్‌పై కోర్టుకు వెళ్లింది. సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ తన పేరును మెటాగా రీబ్రాండ్ చేసిందని....
ఫేస్‌బుక్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా అమెరికాలోని చికాగోకు చెందిన మెటా అనే టెక్ సంస్థ ఫేస్‌బుక్‌పై కోర్టుకు వెళ్లింది. సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ తన పేరును మెటాగా రీబ్రాండ్ చేసిందని.. అది తమ కంపెనీ పేరు అని కోర్టుకు తెలిపింది. ఫేస్‌బుక్ రీబ్రాండింగ్ పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అక్టోబరు 28న ఫేస్‌బుక్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడి తమను తాము మెటా అని పిలుచుకోవాలని నిర్ణయించుకుంది,” అని స్కులిక్ పబ్లిక్ లెటర్‌లో పేర్కొన్నాడు.
ఫేస్‌బుక్ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు. గత మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్ లాయర్లు వెంటాడుతున్నారని నేట్ చెప్పాడు. తాము ఫేస్‌బుక్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపాడు. ఫేస్‌బుక్‌పై అవసరమైన చట్టపరమైన చర్యలను దాఖలు చేయాలని మెటా కంపెనీ నిర్ణయించింది.
” ఫేస్‌బుక్, దాని ఆపరేటింగ్ అధికారులు మా పట్ల మాత్రమే కాదు, మానవాళితో మోసపూరితంగావ్యవహరిస్తున్నారు.” ఆరోపించింది. వినియోగదారుల డేటా గోప్యతపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ గత నెలలో తన కంపెనీకి మెటా అనే కొత్త పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉండబోతుందని ఆయన చెప్పారు. గత మూడు నెలలుగా ఫేస్‌బుక్ లాయర్లు “మా పేరును వారికి అమ్మండి” అని వేటాడుతున్నారని స్కులిక్ తెలిపారు.
Read Also.. Yes Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన యస్ బ్యాంక్.. పూర్తి వివరాలు..