Yes Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన యస్ బ్యాంక్.. పూర్తి వివరాలు..
యస్ బ్యాంక్ సాధారణ, సీనియర్ సిటిజన్లకు వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలను అందిస్తుంది. బ్యాంక్ 7 రోజుల (స్వల్పకాలిక) కాలం నుండి 10 సంవత్సరాల (దీర్ఘకాలిక) వ్యవధికి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తుంది...
యస్ బ్యాంక్ సాధారణ, సీనియర్ సిటిజన్లకు వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలను అందిస్తుంది. బ్యాంక్ 7 రోజుల (స్వల్పకాలిక) కాలం నుండి 10 సంవత్సరాల (దీర్ఘకాలిక) వ్యవధికి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తుంది. బ్యాంక్ తన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును నవంబర్ 3, 2021 నుండి అమలులోకి తీసుకువచ్చింది. తాజా సవరణ తర్వాత, యస్ బ్యాంక్ ఏడు నుండి పద్నాలుగు రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.25%, 15 నుండి 45 రోజులకు 3.5%, 4% వడ్డీ రేటును అందిస్తుంది.
46 నుంచి 90 రోజుల FDలపై 4.5 శాతం, 3 నెలల నుండి 6 నెలలలోపు, 6 నెలల నుండి 9 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ ఇస్తుంది. 9 నెలల నుండి 1 సంవత్సరం లోపు మెచ్యూరిటీ వ్యవధి ఉన్న FDలకు 5.25% వడ్డీ రేటును ఇస్తుంది. 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లకు 6% వడ్డీ రేటు లభిస్తుంది. 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కంటే తక్కువ లేదా సమానమైన ఎఫ్‌డీలకు 6.25% ఇస్తున్నారు.
సీనియర్ సిటిజన్లు సాధారణ ప్రజల కంటే 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేట్లను పొందనున్నారు. 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 3.75% నుండి 7.% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. అంతకుముందు, బ్యాంక్ తన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 3 జూన్ 2021న సవరించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది భవిష్యత్తు కోసం నిర్ణీత మొత్తాన్ని కేటాయించాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. డబ్బు అవసరం లేని వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి పెట్టుబడి ఎంపిక.
Read Also.. EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా..