Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు ఇలా..!

Gold Price Today:మన దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉండనే ఉంటాయి. దేశంలో పసిడికి ఎంతో డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పనవసరం..

Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు ఇలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 08, 2021 | 6:22 AM

Gold Price Today:మన దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉండనే ఉంటాయి. దేశంలో పసిడికి ఎంతో డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పనవసరం లేదు. జ్యూలరీ షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధరలు.. ఈ రోజు కూడా పెరిగాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కొన్ని నగరాల్లో స్వల్పంగా పెరిగితే.. మరి కొన్ని నగరాల్లో కాస్త ఎక్కువగా పెరిగింది. తాజాగా సోమవారం (నవంబర్ 8)న దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఇలా ప్రతి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ కూడా వస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన నగరాల్లో ధరలు.. ► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,210 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. ► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,210గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Credit Card Mistakes: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

SBI Customers Alert: ఎస్‌బీఐ కీలక ప్రకటన.. మీరు పొరపాటున ఇలా చేసినట్లయితే మోసపోవాల్సిందే..