Women’s Day 2022: ఈ మహిళా దినోత్సవం రోజున.. మీ జీవిత భాగస్వామికి ఇలాంటి 7 గిఫ్ట్ లు అందించండి..
Women’s Day 2022: మహిళలకు బహుమతులంటే చాలా ఇష్టం. అది కూడా బాగా ఆలోచించి వారి ఆర్థిక భద్రత(Financial Gift) కోసం ఇచ్చే బహుమతి అయితే.. వారు నిజంగా ఆనందిస్తారు.
Women’s Day 2022: మహిళలకు బహుమతులంటే చాలా ఇష్టం. అది కూడా బాగా ఆలోచించి వారి ఆర్థిక భద్రత(Financial Gift) కోసం ఇచ్చే బహుమతి అయితే.. వారు నిజంగా ఆనందిస్తారు. అత్యవసర సమయాల కోసం డబ్బును పొదుపు చేయటంలో మహిళలకు మించిన వారు ఉండరనటంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. కుటుంబాన్ని రక్షించటంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. అందువల్ల సహజంగా పురుషులు ఎదైనా వారికి బహుమతిగా ఇవ్వాలనుకుంటే.. చాలా ఆలోచించవలసి ఉంటుంది. ప్రతిసారి బంగారు ఆభరణాలు(Gold Ornaments), బట్టలు వంటి వాటినే బహుమతులుగా తీసుకునే ఆలోచనతో వారు ఉండరు. అందువల్ల ఈ సారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ఉపయోగకరమైన గిఫ్ట్ ను ఎంచుకోండి. మీరు ఇచ్చే బహుమతి ఆమె భవిష్యత్తును సురక్షితంగా, సంతోషంగా, సంరక్షణతో కూడుకున్నదిగా ఉండేలా చూసుకోండి.
1. గిఫ్ట్ కార్డు:
ఏదైనా కొనాలని అనిపించినప్పుడల్లా రిడీమ్ చేసుకోగలిగే నిర్దిష్ట విలువ గల గిఫ్ట్ కార్డ్‌ని మీకు ఇష్టమైన స్త్రీకి ఇవ్వడం ఒక మంచి ఎంపిక. ఆమె దానిని భవిష్యత్తులో మీ కోసం, మీ పిల్లల కోసం లేదా మరే ఇతర అవసరాలకోసమైనా ఉపయోగించుకుంటుంది. అయితే, ఆమె అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బు ఉన్న కార్డును ఆమెకు బహుమతిగా ఇవ్వండి. మమ్మల్ని నమ్మండి.. ఆమె ఈ ప్రత్యేకమైన బహుమతిని కచ్చితంగా ఇష్టపడుతుంది.
2. క్రెడిట్ కార్డు:
ప్రతిసారీ జీవిత భాగస్వామి మీ నుండి డబ్బు అడగడం మీకు నచ్చకపోవచ్చు. ఆమె మీపై ఆధారపడి ఉందని మీరు భావించవచ్చు. కాబట్టి.. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ఆమెకు క్రెడిట్ కార్డ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. దానిని ఆమె వినియోగించుకునేందుకు పూర్తి అధికారం, స్వేచ్ఛను ఇవ్వాలి. ఆమె తనకు నచ్చినవి.. అవసరమైనప్పుడల్లా వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించండి. ఇలా చేయటం వల్ల ఆమె అవసరాలకు చేతిలో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది.. మీరు దాని బిల్లును చెల్లించవచ్చు.
3. హెల్త్ ఇన్సూరెన్స్:
స్త్రీలు ఇతరుల ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తారు కానీ.. తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వృద్ధాప్యంలో కలిగే అనారోగ్యాల వల్ల మీ భాగస్వామికి ఇబ్బంది కలగవచ్చు. అందుకోసం కొన్ని సార్లు లక్షల రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. అటువంటి అత్యవసర సమయాలకు సిద్ధంగా ఉండటానికి.. ఆమెకు ఆరోగ్య బీమాను బహుమతిగా ఇవ్వండి. తద్వారా ఆమె భవిష్యత్తు వైద్య బిల్లుల గురించి ఆలోచించకుండా ఆరోగ్యంగా గడిపేందుకు ఆమెకు చక్కటి అవకాశం లభిస్తుంది.
4. క్రిప్టో కరెన్సీ:
క్రిప్టోకరెన్సీ ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. ఆర్థిక అంశాల్లో ప్రస్తుతం ఇదొక నయా ట్రెండ్. కొంత మార్కెట్ రీసెర్చ్ చేసి భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉన్న కొన్ని క్రిప్టో కాయిన్స్ ను ఆమెకోసం కొనండి. ఆమె పెట్టుబడి పెట్టడానికి భయపడితే.. మీరే ఆ పని చేయండి. మార్కెట్ పుంజుకున్న తర్వాత ఆమె మీ నిర్ణయం పట్ల ఖచ్చితంగా సంతోషపడుతుంది.
5. బంగారం:
బంగారం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడని మహిళలు ఎవరూ ఉండరు. ఎందుకంటే గోల్ట్ అంటే వారికి ప్రీతి ఎక్కువ. బంగారం ధర సాధారణంగా కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత.. ఈరోజు మీరు కొనుగోలు చేసే బంగారంపై మీకు తప్పకుండా మంచి లాభం వస్తుంది. ఆమె వివిధ సందర్భాలలో ధరించడానికి ఇష్టపడే బంగారు ఆభరణాలను కలిగి ఉండవచ్చు.. అలాంటప్పుడు మీరు ఆమె కోసం బంగారు బిస్కెట్లు, బంగారు నాణేలు, గోల్డ్ ఫండ్లను కొనుగోలు చేయవచ్చు.
6. FD డిపాజిట్:
మీరు మీ భార్య లేదా కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. దీని వల్ల మీరు పెట్టుబడి పెట్టే సొమ్ము మెుత్తానికి వడ్డీ రూపంలో మంచి రాబడి కూడా వస్తుంది.
7. ఎస్ఐపీ:
క్రమపద్ధతిలో డబ్బును కొద్దికొద్దిగా దాయటం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుందని చెప్పాలి. అందువల్ల మీ భార్య పేరు మీద ఎస్ఐపీ రూపంలో క్రమంగా పెట్టుబడి పెట్టండి. ఇలా వారి ఆర్థిక భరోసా కలిగించే విధంగా బహుమతులను అందించటం ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయి.
ఇవీ చదవండి..
FD Rates: ఎఫ్ డి లపై వడ్డీ రేట్లు పెంచిన ఈ మూడు బ్యాంకులు.. ఎంత పెంచాయంటే..
TCS Share Buyback: టీసీఎస్ సంచలన నిర్ణయం.. వాటిని మళ్లీ రిటర్న్ చేసుకుంటున్న టెక్ దిగ్గజం..