Personal Loan: అత్యవసరమరని డబ్బుల కోసం లోన్‌ యాప్స్‌లో వెతుకుతున్నారా.? ముందు ఈ 6 విషయాలు గమనించండి..

లోన్‌ యాప్స్‌ల వల్ల జరుగుతోన్న నష్టాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరం లేకపోయినా డబ్బులు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తీసుకున్న దాని కంటే ఎక్కువ వడ్డీలే చెల్లించే పరిస్థితి తీసుకొచ్చారు. వడ్డీకి చక్ర వడ్డీ పెంచుకుంటూ పోతూ చివరికి ప్రాణాలు..

Personal Loan: అత్యవసరమరని డబ్బుల కోసం లోన్‌ యాప్స్‌లో వెతుకుతున్నారా.? ముందు ఈ 6 విషయాలు గమనించండి..
Personal Loan App
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2022 | 4:46 PM

లోన్‌ యాప్స్‌ల వల్ల జరుగుతోన్న నష్టాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరం లేకపోయినా డబ్బులు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తీసుకున్న దాని కంటే ఎక్కువ వడ్డీలే చెల్లించే పరిస్థితి తీసుకొచ్చారు. వడ్డీకి చక్ర వడ్డీ పెంచుకుంటూ పోతూ చివరికి ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నారు. మొబైల్‌ యాప్‌లో ఒక సింగిల్‌ క్లిక్‌తో అకౌంట్‌లో డబ్బులు పడిపోవడం, ఎలాంటి డాక్యుమెంటేషన్‌ లేకుండానే లోన్‌ ఇవ్వడంతో ఇలాంటి యాప్స్‌కు బాగా ఆట్రాక్ట్ అవుతున్నారు.

అయితే ఇలాంటి లోన్‌యాప్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్‌బీఐ వినియోగదారులను అలర్ట్‌ చేసింది. ట్విట్టర్‌ వేదికగా ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. లోన్‌యాప్స్‌లో లోన్‌ తీసుకునే ముందు కచ్చితంగా 6 విషయాలను గమనించాలని సూచించింది. ఇంతకీ ఎస్‌బీఐ తెలిపిన ఆ 6 గమనికలు ఏంటంటే..

ఇవి కూడా చదవండి

* లోన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి. ప్లేస్టోర్‌లో ఆ యాప్‌కు రేటింగ్ ఎంత ఉంది.? రివ్యూస్‌ ఎలా ఉన్నాయి.? అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

* ఇక ఇటీవల ఫోన్‌లకు లోన్‌ పేరుతో రకరకాల లింక్‌లను పంపిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఇలాంటి లింక్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏది పడితే ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే ఖాతాలో డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

* అథరైజ్‌ యాప్స్‌ను ఉపయోగించడం వల్ల మొబైల్‌ ఫోన్‌లోని డేటాను దొంగలించే అవకాశం ఉంటుంది. కాబట్టి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

* యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఇచ్చే పర్మిషన్స్‌ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మెసేజెస్‌, కాల్స్‌ వంటి వాటికి అనుమతి ఇచ్చేప్పుడు చెక్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

* లోన్‌ యాప్‌ విషయంలో ఏమాత్రం అనుమానంగా అనిపించినా.? నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉన్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు.

* మరిన్ని సందేహాలు, సమాధానాలకు ఎస్‌బీఐ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..