AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance: రూ. 399తో రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌.. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

ప్రస్తుతం ఇన్సూరెన్స్ తీసుకుంటోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తమకు అనుకోనిది ఏది జరిగినా తమపై ఆధారపడే కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో జీవిత భీమాను తీసుకుంటున్నారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న వారి కోసం...

Insurance: రూ. 399తో రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌.. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
insurance
Narender Vaitla
|

Updated on: Nov 24, 2022 | 2:46 PM

Share

ప్రస్తుతం ఇన్సూరెన్స్ తీసుకుంటోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తమకు అనుకోనిది ఏది జరిగినా తమపై ఆధారపడే కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో జీవిత భీమాను తీసుకుంటున్నారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న వారి కోసం ఒక మంచి ప్లాన్‌ ఉంది. టాటా గ్రూప్‌ అందిస్తోన్న ఈ ప్లాన్‌తో రూ. 10 లక్షల బీమా బీమాదారుడి కుటుంబానికి అందుతుంది. ఇండియా తపాలా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు ద్వారా ఈ పాలసీని పొందొచ్చు. టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీ పేరుతో ఉండే ఈ బీమాను తపాలా శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ఇంతకీ ఈ బీమా ప్లాన్‌లో ఎంత చెల్లించాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీలో రూ. 399 ప్రీమియం చెల్లించాల్సి ఉంఉటంది. 18 నుంచి 65 ఏళ్ల వయసు వరకూ ఈ పాలసీలో చేరొచ్చు. ఇక ఈ పాలసీ తీసుకోవాలనుకునే వారికి కచ్చితంగా ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉండాలి. బీమా తీసుకోవాలనుకునే వారు నేరుగా పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ బీమా తీసుకున్న పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా.. శాశ్వత అంగవైకల్యం వచ్చినా, పక్షవాతం సంభవించినా రూ.10 లక్షలు నామినికీ అందిస్తారు.

అంతేకకాకుండా పాలసీదారుడికి చదువుకొనే ఇద్దరు పిల్లలుంటే రూ. లక్ష ఎడ్యుకేషన్‌ లోన్‌ ఇస్తారు. 24 గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూ.60 వేల వరకూ బిల్లు చెల్లిస్తారు. 24 గంటలలోపు ఆసుపత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూ.30 వేలు లేదా బిల్లు ఎంత అయితే అంత ఇస్తారు. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి లేదా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి గరిష్ఠంగా రూ.25 వేలు లేదా బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది ఇస్తారు. పాలసీదారుడు మృతి చెందితే రూ. 5 వేలు అంత్యక్రియల కోసం అందిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!