Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. కేవలం రూ.95 డిపాజిట్‌తో రూ.14 లక్షలు.. పూర్తి వివరాలు
పోస్టాఫీసు తన వినియోగదారుల కోసం అనేక పథకాలను తీసుకువస్తుంది. ఈ పథకాలలో ఒకటి గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం. ఈ పథకంలో..
పోస్టాఫీసు తన వినియోగదారుల కోసం అనేక పథకాలను తీసుకువస్తుంది. ఈ పథకాలలో ఒకటి గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం. ఈ పథకంలో రోజువారీగా కేవలం రూ.95 ఇన్వెస్ట్‌మెంట్‌తో మెచ్యూరిటీ సమయంలో కేవలం దాదాపు రూ. 14 లక్షలు పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పెట్టుబడిదారుల కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు ఈ పథకం పేరును బట్టి అర్థమవుతోంది. ఈ పథకం పెట్టుబడిదారుడు మనీ బ్యాక్ పాలసీ అని అదనపు ప్రయోజనం పొందినట్లయితే మీరు మెచ్యూరిటీకి ముందే ఈ పథకం నుండి డబ్బు పొందడం ప్రారంభిస్తారు.
ఈ పాలసీని ఎవరు కొనుగోలు చేయవచ్చు?
గ్రామ సుమంగళ్ యోజన పాలసీని తీసుకోవడానికి పెట్టుబడిదారుడి వయస్సు కనీసం 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలో పాలసీదారుకు మెచ్యూరిటీపై బోనస్ కూడా ఇవ్వబడుతుంది. మీరు దీన్ని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం 1995లో ప్రారంభమైంది. పెట్టుబడిదారు మరణిస్తే అతని నామినీ బోనస్‌తో పాటు మొత్తం హామీ మొత్తాన్ని పొందుతాడు.
ఈ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు:
మీరు 15 ఏళ్లు నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. మీరు 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే మీకు 6, 9, 12 పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున డబ్బులు వస్తాయి. మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయం లభిస్తాయి. అదే మీరు 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకుంటే.. అప్పుడు 8, 12, 16 ఏళ్లలో పాలసీ డబ్బులు 20 శాతం రాగా, మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయంలో పొందవచ్చు.
25 సంవత్సరాల వయసులో..
ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెడితే అతను రూ. 7 లక్షల హామీతో 20 సంవత్సరాల పాటు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా రూ. 2853 వాయిదా చెల్లిస్తుండాలి. అంటే రోజుకు దాదాపు రూ.95. మూడు నెలల ప్రాతిపదికన చూస్తే.. దీని కోసం రూ.8,850 డిపాజిట్ చేయాల్సి ఉండగా, 6 నెలల్లో రూ.17,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత, పెట్టుబడిదారు మెచ్యూరిటీపై దాదాపు రూ.14 లక్షలు పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..