PMJJBY: మోడీ సర్కార్ అదిరిపోయే స్కీమ్.. ఏడాదికి కేవలం రూ.436 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రయోజనం!
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అందిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వివిధ రకాల బీమా పాలసీలను అందిస్తోంది. ఏదైనా ప్రమాదంలో..
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అందిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వివిధ రకాల బీమా పాలసీలను అందిస్తోంది. ఏదైనా ప్రమాదంలో ఇంటి యజమాని మరణించినట్లయితే కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా పథకాలను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాల్లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ఒకటి. ఈ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
ఈ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌లో చేరిన వారికి నామమాత్రపు ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. అంటే ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షలు లభిస్తాయి.
ఈ పథకంలో చేరితో ఎంత చెల్లించాలి?
ఈ పథకంలో చేరిన వారు ఏడాదికి రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఇన్సూరెన్స్ ప్రీమియం, ఏజెంట్ కమిషన్ రూ, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు కలిసి ఉంటాయి. అయితే గతంలో ఈ ప్రీమియం రూ.330 ఉండగా, ఇటీవల దీనిని రూ.436కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని కేంద్రం 2015లో ప్రవేశపెట్టింది.బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఆటో డెబిట్ సదుపాయం కూడా పెట్టుకోవచ్చు. దీని ద్వారా మీ అకౌంట్ నుంచి సంవత్సరానికి ఒకసారి రూ.436 బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అవుతుంటాయి.
పథకంలో ఎలా చేరాలి?
ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు నేరుగా బ్యాంకుకు గానీ, పోస్టాఫీసుకు గానీ వెళ్లి ఈ స్కీమ్‌లో చేరవచ్చు. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది. అంటే ఈ ఖాతా నుంచి మే నెలలో రూ.436 డెబిట్ అవుతాయన్నట్లు. ప్రతి ఏటా ఈ డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. పోస్టాఫీస్‌లో ఖాతా ఉన్న వారు పోస్టాపీస్‌కు వెళ్లి పథకంలో చేరవచ్చు.
ఈ స్కీమ్‌లో చేరాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి?
ఈ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్‌లో చేరాలంటే కొన్ని అర్హులు ఉండాలి. పాలసీదారుడికి 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు ఉండాలి. అలాగే బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి.
రూ. 2 లక్షలు ఎలా వస్తాయి?
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. మీరు ప్రతి ఏడాది రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు పాలసీ రెన్యూవల్ అవుతూ వస్తుంది. ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీకి రూ.2 లక్షల అందజేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..