AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Balance Check: మీ ఎస్‌బీఐ ఖాతా బ్యాలెన్స్‌ తెలుసుకోవాలా? ఇలా వాట్సాప్‌ ద్వారా తెలుసుకోండి!

వాట్సాప్‌లో బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడమే కాకుండా, మీరు 10 లావాదేవీల వరకు మినీ స్టేట్‌మెంట్‌ను రూపొందించవచ్చు. ఇది కాకుండా, ఖాతా స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్, లోన్ క్వెరీ, డెబిట్ కార్డ్ సంబంధిత సమాచారం మొదలైన అనేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి...

SBI Balance Check: మీ ఎస్‌బీఐ ఖాతా బ్యాలెన్స్‌ తెలుసుకోవాలా? ఇలా వాట్సాప్‌ ద్వారా తెలుసుకోండి!
Subhash Goud
|

Updated on: Oct 31, 2024 | 5:14 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అతిపెద్ద బ్యాంక్. ఈ బ్యాంకులో కోట్లాది మందికి ఖాతాలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలని చాలాసార్లు అనుకుంటుంటాము. కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా వాట్సాప్‌లో ఎస్‌బిఐ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. వాట్సాప్ ద్వారా అకౌంట్‌లో ఎంత డబ్బు మిగిలి ఉందో తెలుసుకోవడం చాలా సులభం. కేవలం ఒక నంబర్‌కు WhatsApp సందేశాన్ని పంపడం ద్వారా మీరు బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడంతో పాటు అనేక సేవలను పొందవచ్చు.

ఎస్‌బీఐ ఖాతాదారుల సౌలభ్యం కోసం వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవను అందిస్తుంది. దీనితో మీరు బ్యాలెన్స్ తనిఖీ చేయడంతో పాటు అనేక సౌకర్యాలను పొందుతారు. ఎస్‌బీఐ వాట్సాప్‌ ఖాతా నంబర్‌కు సందేశం పంపిన తర్వాత మీరు ఈ సౌకర్యాలను పొందవచ్చు. ఎస్‌బీఐ వాట్సాప్ నంబర్ ఏది, దాని ద్వారా బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయవచ్చో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: BSNL కస్టమర్లకు దీవాళి కానుక.. 365 రోజుల వ్యాలిడిటితో చౌకైన ప్లాన్‌!

వాట్సాప్ ద్వారా SBI బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి?

ఎస్‌బీఐ బ్యాంకింగ్ సర్వీస్‌ వాట్సాప్‌ నంబర్ +919022690226. బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఈ నంబర్‌కి సందేశం పంపాలి. మీరు మీ వాట్సాప్‌ నుండి +919022690226కి ‘హాయ్’ అని పంపినప్పుడు. ఎస్‌బీఐ చాట్-బాట్‌లో ‘గెట్ బ్యాలెన్స్’ ఎంపిక కనిపిస్తుంది. మీరు ఈ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత బ్యాలెన్స్ కనిపిస్తుంది.

వాట్సాప్ బ్యాంకింగ్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి ఈ పద్ధతి పని చేయకపోతే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి +917208933148కి ‘WAREG ఖాతా నంబర్’ ఫార్మాట్‌లో SMS పంపండి. ఉదాహరణకు, మీ ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా నంబర్ 123456789 అయితే, మీరు WAREG 123456789ని +917208933148కి SMS పంపాలి. మీరు ఈ QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవను కూడా ఉపయోగించవచ్చు.

వాట్సాప్‌లో ఈ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో..

మీ రిజిస్ట్రేషన్ విజయవంతమైతే, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన వాట్సాప్‌లో నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు. దీని తర్వాత ముందుగా చెప్పిన పద్ధతిని అనుసరించండి. మీ వాట్సాప్‌ నుండి +919022690226కు ‘హాయ్’ అని పంపండి. మీ అవసరాన్ని బట్టి చాట్-బాట్‌లో అందుబాటులో ఉన్న ఎంపికను ఎంచుకుని సదుపాయాన్ని పొందవచ్చు. వాట్సాప్‌లో బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడమే కాకుండా, మీరు 10 లావాదేవీల వరకు మినీ స్టేట్‌మెంట్‌ను రూపొందించవచ్చు. ఇది కాకుండా, ఖాతా స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్, లోన్ క్వెరీ, డెబిట్ కార్డ్ సంబంధిత సమాచారం మొదలైన అనేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: TRAI: నవంబర్‌ 1 నుంచి కాదు.. జనవరి 1 నుంచి.. గడువు పొడిగించిన ట్రాయ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం