Samsung: అదిరిపోయే AI ఫీచర్లతో మార్కెట్‌లోకి శాంసంగ్ సరికొత్త మోడల్.. ప్రైజ్ ఎంతో తెలుసా?
ఎఫ్, ఎమ్ మోడల్ సిరీస్‌లతో సూపర్ సక్సెస్ అయిన శాంసంగ్ ఎఫ్ సిరీస్ నుంచి Samsung Galaxy F36 5G అనే మరో సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ముఖ్యంగా గత మోడల్స్‌లో లేని ఏఐ ఫీచర్లను యాడ్ చేయడంతో పాటు అదిరిపోయే బ్యాటరీ, కెమెరాలతో ఈ ఫోన్‌ను లాంచ్‌చేసింది. ఇది మరో వారం రోజుల్లో ప్లిఫ్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

మార్కెట్‌లోకి తమ మొబైల్స్‌ను రిలీజ్ చేయాలనుకునే ప్రతి కంపెనీ యూజర్లకు అనుగునంగా తమ ఫోన్‌లను తీసుకొస్తుంది. ఈ మధ్య చాలా మంది ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర ఉండే బడ్జెట్ మొబైల్స్‌ను ఎక్కువగా కొంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ కంపెనీలు కూడా అదే తరహాలో తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. శాంసంగ్ ఇటీవల తీసుకొచ్చిన ఎమ్, ఎఫ్ సిరీస్‌లు బాగా మార్కెట్‌లో అమ్ముడు పోయాయి. దీంతో శాంసంగ్ అదే మొడల్‌లో మరికొన్ని అదనపు ఫీచర్లు యాడ్ చేస్తూ మరో కొత్త ఫొన్‌ను లాంచ్ చేసింది. Samsung Galaxy F36 5G ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో పాటు అదిరిపోయే బ్యాటరీని కూడా శాంసంగ్ అందించనుంది. దక్షిణ కొరియా దిగ్గజం నుండి వచ్చిన ఈ కొత్త F-సిరీస్ ఫోన్ ధర భారతదేశంలో రూ. 20,000 కంటే తక్కువగానే ఉంది. ఈ ఫోన్‌లో Exynos 1380 చిప్‌సెట్‌తో పాటు, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్‌తో వచ్చింది. శాంసంగ్ దీన్ని మూడు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్ వంటి AI ఫీచర్‌లను కూడా ఈ ఫోన్‌లో యాడ్ చేశారు.
భారతదేశంలో Samsung Galaxy F36 5G ధర, లభ్యత
శాంసంగ్ ఇండియాలో ఈఫోన్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. గెలాక్సీ F36 5G 6GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 17,499గా నిర్ణయించగా.. శామ్‌సంగ్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను ఫోన్‌ను రూ. 18,999గా నిర్ణయించింది. ఇక ఈ శాంసంగ్ కొత్త F-సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూలై 29 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇది కోరల్ రెడ్, లక్స్ వైలెట్, ఒనిక్స్ బ్లాక్ అనే మూడు రంగుల్లో విక్రయించబడుతుంది. మూడు రంగులలో లెదర్ ఫినిష్ వెనుక ప్యానెల్ ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌పై అన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.1000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను లభిస్తుంది. అలాగే రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.1500 వరకు తగ్గొచ్చు.
Samsung Galaxy F36 5G ఫీచర్స్
ఈ ఫోన్‌లో డ్యూయల్-సిమ్ హ్యాండ్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌తో పాటు 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను అమర్చారు. దీంట్లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు. 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు ఫ్రంట్ 13 మెగాపిక్సల్ కెమెరాను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో ఫ్రెంట్, బ్యాక్ రెండు కెమెరాల ద్వారా 4k వీడియోను రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 SoC ప్రాసెసర్‌తో పాటు Mali-G68 MP5 GPUను అమర్చారు. ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్‌ను పొందువచ్చు. దీనికి మైక్రో SD కార్డ్ వేసుకోవడం ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు.
6×6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌లో రాబోయే 6 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌తో పాటు, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నారు. అంతే కాకుండా ఇందులో Google సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, AI ఎడిట్ సూచనలు వంటి AI ఫీచర్‌లను కూడా యాడ్ చేశారు. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి మిగతా శాంసంగ్ మోడల్స్‌లానే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉంచారు. కనెక్టివిటీ కోసం, ఫోన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3 మరియు GPS + GLONASS లను అందిస్తున్నారు.
మరిన్ని బిజినెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




