LIC Policy: రోజుకు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల రాబడి.. ఎల్ఐసీ అందించే ఈ పథకం గురించి తెలుసుకోండి

తాజాగా ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ పేరుతో కొత్త పాలసీ ప్రకటించింది. ఈ పాలసీలో పాలసీదారుడు రోజు రూ.45 ఆదా చేయడం ద్వారా పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి రూ.25 లక్షలు పొందవచ్చు. అలాగే ఈ పాలసీ ద్వారా పాలసీదారుడు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి పొందాలని చూసే వారికి జీవన్ ఆనంద్ పాలసీ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది.

LIC Policy: రోజుకు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల రాబడి.. ఎల్ఐసీ అందించే ఈ పథకం గురించి తెలుసుకోండి
Lic Policy
Follow us
Srinu

|

Updated on: May 19, 2023 | 5:00 PM

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పొదుపు పథకాలు భద్రతతో రాబడి పరంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఎల్ఐసీలో అన్ని వయసుల వారికి పాలసీలు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ మీరు తక్కువ పెట్టుబడితో కూడా అధిక లాభాలు పొందవచ్చు. తాజాగా ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ పేరుతో కొత్త పాలసీ ప్రకటించింది. ఈ పాలసీలో పాలసీదారుడు రోజు రూ.45 ఆదా చేయడం ద్వారా పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి రూ.25 లక్షలు పొందవచ్చు. అలాగే ఈ పాలసీ ద్వారా పాలసీదారుడు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి పొందాలని చూసే వారికి జీవన్ ఆనంద్ పాలసీ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది టర్మ్ పాలసీని పోలి ఉంటుంది. మీరు పాలసీని కలిగి ఉన్నంత వరకు మీరు ప్రీమియంలను చెల్లించవచ్చు. ఈ పథకంలో, పాలసీదారుడు ఒకటి కాదు అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందుతాడు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం లక్ష రూపాయలు పెట్టాలి. అయితే ఈ పథకానికి గరిష్ట పెట్టుబడి హామీ ఏదీ లేదు.

ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో మీరు ప్రతి నెలా దాదాపు రూ.1358 డిపాజిట్ చేయడం ద్వారా రూ.25 లక్షలు పొందవచ్చు. రోజుకు ఇలా చూసుకుంటే రోజుకు రూ.45 చొప్పున ఈ పాలసీ కింద 35 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే ఈ పథకం మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీకు రూ. 25 లక్షలు అందుతాయి. మీరు ఏటా పొదుపు చేసిన మొత్తాన్ని పరిశీలిస్తే దాదాపు రూ.16,300 ఉంటుంది. ఇలా 35 ఏళ్లు సేవ్ చేస్తే మొత్తం రూ.5,70,500 డిపాజిట్ అవతుంది. అలాగే పాలసీ టర్మ్ ప్రకారం, బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు అవుతుంది. దానితో మెచ్యూరిటీ వ్యవధి తర్వాత, మీకు రూ. 8.60 లక్షల రివిజన్ బోనస్ మరియు రూ. 11.50 లక్షల చివరి బోనస్ వస్తుంది. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్ రెండుసార్లు ఇస్తారు. అలాగే మీ పాలసీ వ్యవధి తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఉండాలి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవన్ ఆనంద్ పాలసీని తీసుకునే పాలసీదారుడికి ఈ పథకం కింద ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉండదు. అయితే మీరు దీని ప్రయోజనాలను పరిశీలిస్తే మీకు ఇందులో నాలుగు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ ప్రయోజనం ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాలసీకి డెత్ బెనిఫిట్ మాత్రమే వస్తుంది. అంటే, పాలసీదారుడు ఏదైనా కారణం వల్ల మరణిస్తే, నామినీ పాలసీలో 125% డెత్ బెనిఫిట్ పొందుతారు. మరోవైపు పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే నామినీకి హామీ ఇచ్చిన సమయానికి సమానంగా డబ్బు వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?