Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF Calculator: రోజుకు రూ.300 పెట్టుబడితో రూ.2.36 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసుకోండి

పీఎప్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ఈ పథకంలో పొందిన వడ్డీతో పాటు మెచ్యూరిటీపై విత్‌డ్రా చేసే మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది.

PPF Calculator: రోజుకు రూ.300 పెట్టుబడితో రూ.2.36 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసుకోండి
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: May 19, 2023 | 4:30 PM

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) అంటే ప్రభుత్వ హామీతో బ్యాంకులు, పోస్టాఫీస్లు అందించే అద్భుతమైన పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెడితే 15 ఏళ్ల వరకూ విత్‌డ్రాకు అవకాశం ఉండకపోవడంతో ధీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం పెట్టుబడిదారులకు ట్రిపుల్ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. పీపీఎప్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ఈ పథకంలో పొందిన వడ్డీతో పాటు మెచ్యూరిటీపై విత్‌డ్రా చేసే మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాల్లో మెచ్యూర్ అయినప్పటికీ పెట్టుబడిదారులు 5 సంవత్సరాల బ్లాక్‌లలో ఖాతాను పొడిగించడానికి మరియు ఆ సమయంలో వర్తించే వడ్డీ రేటును పొందేందుకు అనుమతిస్తారు. ఈ అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకంలోని ఫీచర్‌ని ఉపయోగించి పీపీఎఫ్ ఖాతాదారులు తాము ఉద్యోగం చేసే సంవత్సరాల్లో రూ. 1 కోటి కంటే ఎక్కువ సొమ్మును కూడబెట్టుకోవచ్చు. ప్రస్తుతం రోజుకు మూడు వందల రూపాయలు లెక్కన నెలకు రూ.9000 పెట్టుబడి పెడితే 15 ఏళ్లల్లో ఎంత రాబడి వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

పీపీఎఫ్ కాలిక్యులేటర్ ప్రకారం నెలవారీ రూ.9000 పెట్టుబడితో ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వడ్డీ రేటుతో 15 సంవత్సరాల్లో రూ. 29.2 లక్షలకు పెరుగుతుంది . రోజుకు కేవలం రూ. 300 పొదుపు చేస్తే నెలాఖరులో పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారుడికి రూ.9000 లభిస్తుంది. అయితే, జీతం పొందే ఉద్యోగులు పీపీఎఫ్‌కి బదులుగా వారి వీపీఎఫ్ ఖాతాలో ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ పథకంలో 20 సంవత్సరాల పాటునెలకు రూ. 9000 పెట్టుబడి పెట్టడం ద్వారా మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 47.9 లక్షలు, 7.1% వడ్డీతో 25 సంవత్సరాలలో రూ. 74.2  లక్షలుగా ఉంటుంది. 30 ఏళ్లలో మీరు నెలకు రూ. 9000 పెట్టుబడిని కొనసాగిస్తే, మెచ్యూరిటీ మొత్తం రూ. 1.11 కోట్లు కావచ్చు. అయితే నెలకు రూ. 9000 సహకారంతో పీపీఎఫ్‌ ఖాతా 40 ఏళ్లలో రూ. 2.36 కోట్లకు చేరుతుంది. అయితే 7.1% వడ్డీతో 35 ఏళ్లలో రూ. 1.63 కోట్లకు పెరగవచ్చు. దీని అర్థం, ఎవరైనా 20 సంవత్సరాల వయస్సు నుంచి PPF లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ సమయంలో ఖాతాలో రూ.2.36 కోట్లు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి