LIC Jeevan Anand: రోజు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల రాబడి.. ఎల్ఐసీ అద్భుత పాలసీ వివరాలివే

న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అనేది పొదుపులు, రక్షణకు సంబంధించి మిశ్రమ ప్రయోజనాలను అందించే పార్టిసిటింగ్ హోల్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్. ఇది ప్రఖ్యాత ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీకి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్. ఈ పాలసీ గణనీయమైన దీర్ఘకాలిక రాబడిని అందిస్తుంది. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు హామీతో కూడిన రాబడిని పొందడమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు.

LIC Jeevan Anand: రోజు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల రాబడి.. ఎల్ఐసీ అద్భుత పాలసీ వివరాలివే
LIC
Follow us
Srinu

|

Updated on: Jun 05, 2023 | 5:45 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ. అలాగే జనాభాలోని వివిధ వర్గాల కోసం నిరంతరం వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ పథకాలు వ్యక్తులు తమ పిల్లల చదువులు, వివాహం, పదవీ విరమణ వంటి జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్ల కోసం ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఎల్ఐసీకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకదాని గురించి తెలుసుకుందాం. అదే ఎల్ఐసీ కొత్త జీవన్ ఆనంద్ పాలసీ. న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అనేది పొదుపులు, రక్షణకు సంబంధించి మిశ్రమ ప్రయోజనాలను అందించే పార్టిసిటింగ్ హోల్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్. ఇది ప్రఖ్యాత ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీకి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్. ఈ పాలసీ గణనీయమైన దీర్ఘకాలిక రాబడిని అందిస్తుంది. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు హామీతో కూడిన రాబడిని పొందడమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. అంతేకాకుండా సాధారణ ప్రీమియం చెల్లింపులను ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. పాలసీ వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్న సందర్భంలో వారు మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకుంటారు. దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీ మరణ ప్రయోజనాన్ని అందుకుంటారు. 100 సంవత్సరాల వరకు పాలసీ కవర్‌ని పొందే ఎంపిక ఈ పాలసీని నిజంగా అసాధారణమైనదిగా చేస్తుంది. అయితే ఈ జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా వచ్చే ఇతర ప్రయోజనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

మెచ్యూరిటీ బెనిఫిట్

పాలసీదారుగా మీరు పాలసీ టర్మ్ ముగిసే వరకు జీవించి ఉంటే మీరు మెచ్యూరిటీపై హామీ మొత్తాన్ని అందుకుంటారు.

డెత్ బెనిఫిట్

దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణించిన సందర్భంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

లాభాల్లో వాటా

ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కూడా ఎల్ఐసీ ద్వారా వచ్చే లాభాలలో పాల్గొనడానికి అర్హులు అవుతారు.

పన్ను మినహాయింపు

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వలన పన్ను మినహాయింపు యొక్క అదనపు ప్రయోజనాన్ని మీకు అందిస్తుంది. తద్వారా మీరు పన్నులపై ఆదా చేసుకోవచ్చు.

రూ. 45 పెట్టుబడితో రూ.25 లక్షల రాబడి ఇలా

ఎల్‌ఐసీ కొత్త జీవన్ ఆనంద్ పాలసీ కింద పెట్టుబడిదారులు కనీసం రూ. 5 లక్షల హామీ మొత్తాన్ని పొందవచ్చు. మీరు ఈ హామీ మొత్తాన్ని ఎంచుకుంటే మీరు 35 సంవత్సరాల వ్యవధిలో మొత్తం రూ.25 లక్షలను జమ చేసుకోవచ్చు. 35 సంవత్సరాల కాలవ్యవధికి, వార్షిక పెట్టుబడి రూ. 16,300 లేదా నెలకు రూ. 1,358 తద్వారా కేవలం రూ. 45 రోజువారీ పెట్టుబడి కూడా మిమ్మల్ని రూ. 25 లక్షల మెచ్యూరిటీ మొత్తం పొందడానికి అర్హులవుతారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!