LIC New Policy: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే సరికొత్త పాలసీ.. వారే అసలు టార్గెట్

ఎల్ఐసీ కూడా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను లాంచ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువతను పొదుపు వైపు మళ్లించేలా కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా ఆధార్ స్థంబ్ పాలసీ పేరుతో సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎల్ఐసీ ఆధార్ స్టాంబ్ అనేది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత హామీ పొదుపు ప్లాన్.

LIC New Policy: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే సరికొత్త పాలసీ.. వారే అసలు టార్గెట్
LIC
Follow us
Srinu

|

Updated on: Jun 05, 2023 | 5:58 PM

జీవిత బీమా అంటే అనుకోని పరిస్థితుల్లో మనం చనిపోతే మన కుటుంబానికి ఆర్థిక భరోసా కోసం తీసుకుంటూ ఉంటాం. కేవలం మనం లేనప్పుడు ఆర్థిక భద్రత కోసమే కాకుండా పొదుపు మంత్రంగా కూడా కొంత మంది జీవిత బీమా పాలసీల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. భారతదేశంలో ఎన్ని జీవిత బీమా సంస్థలు వచ్చినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే చాలా మందికి ఓ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఎల్ఐసీ కూడా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను లాంచ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువతను పొదుపు వైపు మళ్లించేలా కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా ఆధార్ స్థంబ్ పాలసీ పేరుతో సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎల్ఐసీ ఆధార్ స్టాంబ్ అనేది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత హామీ పొదుపు ప్లాన్. ఇది సరసమైన ప్రీమియం రేటుతో పురుష దరఖాస్తుదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఏదైనా సంఘటన జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది, అయితే జీవిత బీమా పాలసీ మొత్తం కాల వ్యవధిలో జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనంగా భవిష్యత్ కోసం సంపదను కూడగట్టుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ పాలసీ ద్వారా అత్యున్నత ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

ఆధార్ స్తంభ్ ప్లాన్ ముఖ్య ఫీచర్లు ఇవే

డెత్ బెనిఫిట్

బీమా చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తూ అకాల మరణం సంభవిస్తే నామినీ లేదా లబ్ధిదారుడు మరణ ప్రయోజనానికి అర్హులు. ఇది బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్‌కు సమానంగా ఉంటుంది. లాయల్టీ అడిషన్ అనేది పాలసీ ఫండ్ విలువ నుంచి చెల్లించబడే బోనస్.

మెచ్యూరిటీ ప్రయోజనం 

పాలసీదారుడు పాలసీ వ్యవధిని జీవించి ఉన్నట్లయితే వారు మెచ్యూరిటీ ప్రయోజనానికి అర్హులు. ఇది బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్‌కు సమానంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆటో కవర్ సదుపాయం 

పాలసీదారు ప్రీమియం చెల్లింపును కోల్పోయినప్పటికీ పాలసీ అమల్లో ఉండేలా ఈ సౌకర్యం నిర్ధారిస్తుంది. పాలసీ తీసుకున్న మొదటి రెండు సంవత్సరాలకు ఆటో కవర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

లోన్ సదుపాయం

పాలసీ మొదటి రెండు సంవత్సరాల తర్వాత పాలసీ యొక్క సరెండర్ విలువపై పాలసీదారు రుణాన్ని పొందవచ్చు.

యాడ్-ఆన్ రైడర్‌లు

పాలసీ కవరేజీని మెరుగుపరచడానికి పాలసీదారు ప్రమాద మరణం & వైకల్యం బెనిఫిట్ రైడర్ వంటి యాడ్-ఆన్ రైడర్‌లను కూడా ఎంచుకోవచ్చు.

ఎల్ఐసీ ఆధార్ స్టాంబ్ ప్లాన్ ప్రీమియం పాలసీదారు వయస్సు, హామీ మొత్తం, పాలసీ వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు. ప్రీమియం సంవత్సరానికి, అర్ధ-సంవత్సరానికి, త్రైమాసిక లేదా నెలవారీగా చెల్లించే అవాకాశం ఉంది.

అర్హత షరతులు, ఇతర పరిమితులు

ఎ) జీవితానికి కనీస ప్రాథమిక హామీ మొత్తం : రూ 2,00,000

బి) జీవితానికి గరిష్ట ప్రాథమిక హామీ మొత్తం : రూ 5,00,000

బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5,00 నుంచి రూ. 2,00,000 నుండి రూ. 3,00,000/- వరకూ, అలాగే రూ. 3,00,000 పైన ఉన్న బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం రూ. 25,000 గుణకాలుగా ఉండాలి.

సి) ప్రవేశానికి కనీస వయస్సు – 8 సంవత్సరాలు 

డి) ప్రవేశానికి గరిష్ట వయస్సు – 55 సంవత్సరాలు 

ఇ) పాలసీ టర్మ్ – 10 నుంచి 20 సంవత్సరాలు

ఎఫ్) ప్రీమియం చెల్లింపు వ్యవధి – పాలసీ టర్మ్‌తో సమానం

జి) మెచ్యూరిటీలో కనీస వయస్సు- 18 సంవత్సరాలు 

హెచ్) మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు – 70 సంవత్సరాలు 

రిస్క్ ప్రారంభం ఇలా

ఈ ప్లాన్ కింద రిస్క్‌ని అంగీకరించిన తేదీ నుంచి వెంటనే రిస్క్ ప్రారంభమవుతుంది.

ప్లాన్ కింద వెస్టింగ్ ఇలా

మైనర్ జీవితానికి సంబంధించిన పాలసీని జారీ చేస్తే 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా వెంటనే వచ్చే పాలసీ వార్షికోత్సవం నాడు ఆ పాలసీ ఆటోమేటిక్‌గా లైఫ్ అష్యూర్డ్‌కి చెందుతుంది. అలాంటి వెస్టింగ్‌పై వారి మధ్య ఒప్పందంగా పరిగణిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..