AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Dhan Rekha Plan: తక్కువ పెట్టుబడి లాభాలిచ్చే సూపర్ పాలసీ.. ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీ వివరాలివే..!

తాజాగా ఎల్ఐసీ ఒకేసారి పెట్టుబడి పెట్టే వారికి అనువుగా ఉండేలా సరికొత్త పాలసీలను లాంచ్ చేసింది. ఈ పాలసీ ద్వారా మంచి రాబడిని అందించడమే కాక బీమా సదుపాయాన్ని కూడా కల్పించింది. ధన్ రేఖ, మనీ-బ్యాక్ బీమా కవరేజ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీ వినియోగదారులకు మంచి లాభాలను ఇస్తుందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.

LIC Dhan Rekha Plan: తక్కువ పెట్టుబడి లాభాలిచ్చే సూపర్ పాలసీ.. ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీ వివరాలివే..!
Lic Policy
Nikhil
|

Updated on: May 23, 2023 | 3:45 PM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అంటే భారతీయులకు ఓ మంచి నమ్మకం. పెట్టుబడికి మంచి భరోసాతో పాటు బీమా కవరేజ్ కూడా అద్భుతంగా అందిస్తుందని చాలా మంది ఇందులో పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎల్ఐసీ కూడా ఎప్పటికప్పుడు కొత్త తరహా పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా ఎల్ఐసీ ఒకేసారి పెట్టుబడి పెట్టే వారికి అనువుగా ఉండేలా సరికొత్త పాలసీలను లాంచ్ చేసింది. ఈ పాలసీ ద్వారా మంచి రాబడిని అందించడమే కాక బీమా సదుపాయాన్ని కూడా కల్పించింది. ధన్ రేఖ, మనీ-బ్యాక్ బీమా కవరేజ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీ వినియోగదారులకు మంచి లాభాలను ఇస్తుందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీ పాలసీదారులు మరణించే వరకు లేదా పాలసీ మెచ్యూరిటీకి వచ్చే వరకు క్రమం తప్పకుండా వారి లాభాల మొత్తాన్ని అందిస్తుంది. అలాగే ఈ పాలసీలో మహిళలతో పాటు థర్డ్ జెండర్‌గా గుర్తించే వారికి ప్రత్యేక డిస్కౌంట్ ప్రీమియంలను అందిస్తుంది. ఎల్ఐసీ ధన్ రేఖ అనే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు జీవిత బీమా ప్లాన్. ఈ పాలసీ రక్షణ, పొదుపు రెండింటినీ అందిస్తుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే ఈ ప్లాన్ ద్వారా ఎల్ఐసీ పాలసీదారుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.

పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మనుగడపై కాలానుగుణ చెల్లింపులు కూడా ముందుగా నిర్ణయించిన వ్యవధిలో చేయవచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో జీవించి ఉన్న పాలసీదారుకు హామీనిచ్చే ఏకమొత్తం చెల్లింపులు అందిస్తారు. క్రెడిట్ సౌకర్యాల ద్వారా ఈ విధానం లిక్విడిటీ సమస్యను కూడా పరిష్కరిస్తుంది. ఈ ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీని తీసుకోవడానికి కనీసం 8 సంవత్సరాల వయస్సు ఉండాలి. 

ఎల్ఐసీ ధన్ రేఖ ప్రయోజనాలు

  • మరణ ప్రయోజనం
  • మనుగడ ప్రయోజనం
  • మెచ్యూరిటీ ప్రయోజనం
  • పన్ను ప్రయోజనాలు

ఎల్ఐసీ ధన్ రేఖ పెట్టుబడి ఇలా

మీరు ఈ ప్లాన్‌లో 30 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెడితే, పాలసీ ప్రీమియం కాలపరిమితి కూడా 30 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే మీరు ఒక్కసారి ప్రీమియం రూ. 6,70,650 కడితే  ప్రాథమిక హామీగా రూ. 10,00,000 బోనస్ వస్తుంది. అలాగే అనుకోని పరిస్థితుల్లో మరణం సంభవిస్తే రూ.12,50,000 మరణ బీమా కూడా ఉంటుంది. అయితే పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనాలు, పాలసీ సొమ్ముపై వడ్డీ రెండు కలిపి రూ.23 లక్షలు అందుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి