AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI vs LIC: సీనియర్ సిటిజన్లకు ఏ వార్షిక పథకం సురక్షితమో తెలుసా? మెరుగైన ప్లాన్ వివరాలను తెలుసుకోండి

చాలా బ్యాంకులతో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతున్నా పెట్టుబడిదారులు మాత్రం నమ్మకమైన సంస్థలైన ఎస్‌బీఐ, ఎల్ఐసీ స్కీమ్‌ల వైపే మొగ్గుచూపుతున్నారు. యాన్యుటీ ప్లాన్‌ల కింద వ్యక్తులు నిర్దిష్ట కాలానికి లేదా వారి జీవితాంతం సాధారణ ఆదాయానికి బదులుగా ఏకమొత్తంలో పెట్టుబడి పెడతారు. ఈ ప్లాన్‌లు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్‌పై మంచి రాబడిని అందిస్తాయి.

SBI vs LIC: సీనియర్ సిటిజన్లకు ఏ వార్షిక పథకం సురక్షితమో తెలుసా? మెరుగైన ప్లాన్ వివరాలను తెలుసుకోండి
Fixed Deposit
Nikhil
|

Updated on: Jun 05, 2023 | 4:25 PM

Share

పదవీ విరమణ తర్వాత ప్రతి ఒక్కరూ సురక్షితమైన, స్థిరమైన ఆదాయం కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసం యాన్యుటీ పథకాలు ఒక ప్రముఖ ఎంపికగా ఉంటాయి. చాలా మంది పెట్టుబడిదారులు సౌకర్యవంతమైన భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను పొందేందుకు యాన్యుటీ పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చాలా బ్యాంకులతో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతున్నా పెట్టుబడిదారులు మాత్రం నమ్మకమైన సంస్థలైన ఎస్‌బీఐ, ఎల్ఐసీ స్కీమ్‌ల వైపే మొగ్గుచూపుతున్నారు. యాన్యుటీ ప్లాన్‌ల కింద వ్యక్తులు నిర్దిష్ట కాలానికి లేదా వారి జీవితాంతం సాధారణ ఆదాయానికి బదులుగా ఏకమొత్తంలో పెట్టుబడి పెడతారు. ఈ ప్లాన్‌లు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్‌పై మంచి రాబడిని అందిస్తాయి. ఇవి ఇన్వెస్టర్‌కి వాయిదాల్లో చెల్లిస్తారు. యాన్యుటీ పథకంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అందించే పథకాలను ఓ సారి పోల్చి చూసుకుందాం. ఏ యాన్యుటీ స్కీమ్ ఉత్తమ పెట్టుబడి ఎంపిక అని నిర్ణయించడం అనేది వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఎల్ఐసీ అందించే లైఫ్ యాన్యుటీ స్కీమ్ వారి జీవితకాలమంతా స్థిరమైన ఆదాయాన్ని పొందాలనుకునే వారికి అనుకూలంగా ఉండవచ్చు. మరోవైపు, రిటర్న్, లిక్విడిటీ దృక్కోణం నుంచి ఎస్‌బీఐ  యాన్యుటీ పథకం రిటైర్మెంట్ ఫండ్‌లను వైవిధ్యపరచడానికి ఆకర్షణీయమైన ఎంపికను అందిస్తుంది ప్రత్యేకించి వారి ప్రాథమిక ఆదాయ వనరుగా దానిపై ఆధారపడని వ్యక్తుల కోసం ఈ పథకం సౌలభ్యంగా ఉంటుంది.

ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌ను అందజేస్తుంది. ఇక్కడ పెట్టుబడిదారులు బ్యాంకులో ఏకమొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. తదనంతరం నెలవారీ చెల్లింపులను స్వీకరిస్తారు. ఈ చెల్లింపులు ప్రధాన మొత్తంతో పాటు తగ్గుతున్న ప్రిన్సిపల్‌పై వచ్చే వడ్డీని కలిగి ఉంటాయి. వీటిన నెలవారీ వార్షిక వాయిదాలు అని పిలుస్తారు. ఈ చెల్లింపులు పెట్టుబడిదారులకు నమ్మకమైన ఆదాయ వనరును అందిస్తాయి. డిపాజిట్ కాల వ్యవధి మూడు నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. వడ్డీ రేట్లు సారూప్య టర్మ్ డిపాజిట్లకు సరిపోతాయి. సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ రేటుకు అర్హులు. ఈ పథకం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌కు గరిష్ట పరిమితి లేదు. అయితే కనీస డిపాజిట్ రూ. 25,000. పెట్టుబడిదారులు బ్యాలెన్స్ మొత్తంలో 75% వరకూ రుణాలకు అర్హులు. ఈ పథకం అన్ని ఎస్‌బీఐ శాఖల మధ్య బదిలీ సౌలభ్యాన్ని అందిస్తుంది.

ఎల్ఐసీ యాన్యుటీ స్కీమ్‌లు

ఎల్‌ఐసి న్యూ జీవన్ నిధి ప్లాన్ 

ఈ సాంప్రదాయ వాయిదాపడిన జీవిత బీమా పథకం పాలసీ వ్యవధి అంతటా రెగ్యులర్ ప్రీమియంలను చెల్లించడం ద్వారా రిటైర్మెంట్ కార్పస్‌ను నిర్మించుకోవడానికి పెట్టుబడిదారులను అనుమతిస్తుంది. ప్లాన్ మెచ్యూర్ అయిన తర్వాత యాన్యుటీలు చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎల్ఐసీ జీవన్ శాంతి ప్లాన్ 

ఫ్లెక్సిబిలిటీ ఎంపికను అందిస్తూ ఈ పెన్షన్ ప్లాన్ పెట్టుబడిదారులు పాలసీని కొనుగోలు చేసిన వెంటనే లేదా తదుపరి దశలో యాన్యుటీలను పొందేందుకు అనుమతిస్తుంది. అందుబాటులో ఉన్న పది యాన్యుటీ ఎంపికలతో పాలసీదారులు తమ ఆదాయ అవసరాలకు బాగా సరిపోయే చెల్లింపు ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VII

2020లో ప్రారంభించిన ఈ ప్లాన్ పాలసీదారులకు బహుళ యాన్యుటీ ఎంపికలను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 10 ఆప్షన్లలో తమ అవసరాలకు అనుగుణంగా పెన్షన్ చెల్లింపు ప్రణాళికను ఎంచుకోవచ్చు. ఎల్ఐసీ జీవన్ అక్షయ్ VII ప్లాన్ కింద పాలసీదారు మరణించే వరకు పెన్షన్ చెల్లిస్తారు. ఎంచుకున్న చెల్లింపు ఎంపికను బట్టి పాలసీని కొనుగోలు చేసిన వెంటనే యాన్యుటీ చెల్లింపు కూడా ప్రారంభమవుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం