Royal Enfield: రాయల్ ఎన్‌ఫిల్డ్ బైక్‌ల రీకాల్.. కారణం ఏంటో తెలిపిన కంపెనీ!
ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మార్కెట్ నుండి కొన్ని బైక్‌లను నవంబర్ 2022- మార్చి 2023 మధ్య తయారు చేసిన అన్ని బైకులను రీకాల్ చేయాలని నిర్ణయించింది. కంపెనీ నిర్వహించిన రెగ్యులర్ టెస్టింగ్‌లో వెనుక లేదా సైడ్ రిఫ్లెక్టర్‌లలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఆ బైక్‌లను రీకాల్ చేయాలని..
ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మార్కెట్ నుండి కొన్ని బైక్‌లను నవంబర్ 2022- మార్చి 2023 మధ్య తయారు చేసిన అన్ని బైకులను రీకాల్ చేయాలని నిర్ణయించింది. కంపెనీ నిర్వహించిన రెగ్యులర్ టెస్టింగ్‌లో వెనుక లేదా సైడ్ రిఫ్లెక్టర్‌లలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఆ బైక్‌లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. దక్షిణ కొరియా, అమెరికా, కెనడా నుండి ప్రారంభించి దశలవారీగా ఈ లోపాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఆ తర్వాత భారత్, బ్రెజిల్, లాటిన్ అమెరికా, యూరప్, బ్రిటన్ నుంచి బైకులను వెనక్కి రప్పిస్తోంది కంపెనీ.
ఇది కూడా చదవండి: Success Story: ఒకప్పుడు ఆవుల కాపరిగా నెలకు రూ.80.. ఇప్పుడు ఏడాదికి రూ.8 కోట్లు.. సక్సెస్ స్టోరీ!
రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకారం.. కొన్ని మోటార్ సైకిళ్లలో రిఫ్లెక్టర్లు అవసరమైన రిఫ్లెక్టివ్ పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించింది. బైక్‌లు నడుపుతున్నప్పుడు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. చీకట్లో రిఫ్లెక్టర్లు వెలుతురును సరిగా పరావర్తనం చేయకపోవడం వల్ల బైక్‌ను ఇతరులకు సరిగా చూడలేని పరిస్థితి నెలకొంది. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వెనుక, సైడ్ రిఫ్లెక్టర్‌లను మార్చడానికి ఈ బైక్‌లను దశలవారీగా రీకాల్ చేస్తోంది. రీకాల్ చేసిన బైక్‌ల సంఖ్యను కంపెనీ గోప్యంగా ఉంచింది. అయితే ఆ సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Missile System: యుద్ధం సమయంలో శత్రువును ఎదుర్కొనే ఉత్తమ క్షిపణి వ్యవస్థ ఉన్న 5 దేశాలు.. భారత్ ఏ స్థానమంటే..
కంపెనీ లోపాన్ని ఉచితంగా సరిచేస్తుంది:
రీకాల్‌కు సంబంధించి బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ యాజమాన్యం మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సమస్య గురించి పెద్దగా ఫిర్యాదులు రానప్పటికీ తామే సమస్యను గుర్తించి రీకాల్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీనికి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుందని, అందువల్ల, సంస్థ సర్వీస్ టీమ్‌లను సంప్రదిస్తోంది. ఈ సమస్యను సరిచేయడానికి కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లోని అన్ని కస్టమర్ల బైక్‌ల రిఫ్లెక్టర్‌లను ఉచితంగా ఏర్పాటు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Airplane Tires: విమానం టైర్లు బరువు, వేగాన్ని ఎలా తట్టుకుంటాయి? వీటిని ఎలా తయారు చేస్తారు?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి